తెలంగాణ

telangana

ETV Bharat / state

Drunk and Drive: డ్రంక్ అండ్ డ్రైవ్​లో మందుబాబుల హల్‌చల్‌.. పోలీసులతో వాగ్వాదం - ts news

Drunk and Drive: బంజారాహిల్స్​లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ రసాభాసగా మారింది. కొంతమంది మందుబాబులు కావాలనే కొందరు మద్యం తాగిన వారిని వదిలేసి మమ్మల్ని పట్టుకున్నారని ట్రాఫిక్​ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రోడ్డుపై బైఠాయించి అందోళన చేశారు. 'నేను మేడ్చల్ ఎమ్మెల్యేని నన్నే ఆపుతారా..' అంటూ ఒక వ్యక్తి హల్​చల్‌ చేశాడు.

Drunk and Drive: డ్రంక్ అండ్ డ్రైవ్​లో మందుబాబుల హల్‌చల్‌.. పోలీసులతో వాగ్వాదం
Drunk and Drive: డ్రంక్ అండ్ డ్రైవ్​లో మందుబాబుల హల్‌చల్‌.. పోలీసులతో వాగ్వాదం

By

Published : Mar 30, 2022, 9:48 AM IST

Updated : Mar 30, 2022, 10:26 AM IST

Drunk and Drive: హైదరాబాద్​లో డ్రంక్ అండ్​ డ్రైవ్ సందర్భంగా మంగళవారం రాత్రి నిర్వహించిన తనిఖీలు రసాభాసగా మారాయి. బంజారాహిల్స్​లో పార్క్ హయత్ హోటల్ ఎదురుగా నిర్వహించిన తనిఖీల్లో భారీగా మందుబాబులు దొరికారు. కొంతమందిని వదిలేసి, తమని కావాలని అడ్డగించారని మందుబాబులు ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడపటంతో పోలీసులు సీజ్ చేయగా.. తిరిగి తమకు ఇవ్వాలని మందుబాబులు గొడవకు దిగారు.

రోడ్డుకు అడ్డంగా పడుకొని, రోడ్డుపై వచ్చే ఇతర వాహనాలను ఆపుతూ వీరంగం సృష్టిస్తూ ట్రాఫిక్​కు అంతరాయం కలిగించారు. నేను మేడ్చల్ ఎమ్మెల్యే నన్నే ఆపుతారా అంటూ ఒక వ్యక్తి దౌర్జన్యానికి దిగటంతో.. సివిల్ పోలీసుల సహాయంతో అతనితో పాటు మరో ఐదుగురు మందుబాబులను పోలీసులు అదుపులోకి తీసుకొని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్​కు తరలించారు.

డ్రంక్ అండ్ డ్రైవ్​లో మందుబాబుల హల్‌చల్‌.. పోలీసులతో వాగ్వాదం

ఇదీ చదవండి:

Last Updated : Mar 30, 2022, 10:26 AM IST

ABOUT THE AUTHOR

...view details