Drugs were Destroyed by the Drug Disposal Committee: వివిధ కేసుల్లో భారీగా పట్టుబడిన మత్తుపదార్ధాలను మాదకద్రవ్యాల డిస్పోజల్ కమిటీ ధ్వంసం చేసింది. పలు కేసులలో పోలీసులు 1500 కిలోల గంజాయి, 1100 లీటర్ల హాష్ ఆయిల్, 500 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని 10 పోలీస్‌స్టేషన్‌లలో నమోదయిన మత్తుపదార్ధాల కేసుల్లో పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలను డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఛైర్మన్, సంయుక్త పోలీసు కమిషనర్ గజరావు భూపాల్ ఆధ్వర్యంలో దుండిగల్‌లోని రామ్‌కీ ఎన్‌వీరో ఇంజినీర్స్‌లో పోలీసులు ధ్వంసం చేశారు.
స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ మొత్తం ధ్వంసం చేశారు.. - డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఛైర్మన్
Drugs were Destroyed by the Drug Disposal Committee: మాదకద్రవ్యాల డిస్పోజల్ కమిటీ వివిధ కేసుల్లో భారీగా పట్టుబడిన మత్తుపదార్ధాలను ధ్వంసం చేసింది. హైదరాబాద్‌లోని 10 పోలీస్‌స్టేషన్‌లలో నమోదయిన మత్తుపదార్ధాల కేసుల్లో స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలను డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఛైర్మన్, సంయుక్త పోలీసు కమిషనర్ గజరావు భూపాల్ ఆధ్వర్యంలో దుండిగల్‌లోని రామ్‌కీ ఎన్‌వీరో ఇంజినీర్స్‌లో పోలీసులు ధ్వంసం చేశారు.
Drug Disposal Committee