తెలంగాణ

telangana

ETV Bharat / state

నిమజ్జనానికి వచ్చే భక్తులకు తాగునీటి  ఏర్పాట్లు - జలమండలి

గణేశ్ నిమజ్జనం వీక్షించడానికి వచ్చే భక్తులకు తాగునీటి సమస్యలు ఎదురవకుండా ఏర్పాట్లు చేశామని జలమండలి ఎండీ దాన కిశోర్ తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లపై హైదరాబాద్ ఖైరతాబాద్​లోని జలమండలి  కార్యాలయంలో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

నిమజ్జనానికి వచ్చే భక్తులకు తాగునీటి  ఏర్పాట్లు

By

Published : Sep 8, 2019, 10:02 AM IST

గణేష్ నిమజ్జనం వీక్షించడానికి వచ్చే భక్తులకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా నగరవ్యాప్తంగా 115 ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యం కల్పించాలని జలమండలి ఎండీ దాన కిశోర్ సూచించారు. ఖైరతాబాద్ జలమండలి కార్యాలయంలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. సుమారుగా 30 లక్షల 52వేల మంచినీటి ప్యాకెట్లను అందుబాటులో ఉంచామన్నారు. తెల్లవారుజామున 3గంటల నుంచి ఈ సేవలందించనున్నారని పేర్కొన్నారు. శోభాయాత్ర సాగే ప్రాంతాల్లో మంచినీటి పైపులైనులో లీకేజీలు, మ్యాన్ హోళ్లు సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details