తెలంగాణ

telangana

ETV Bharat / state

మత్తు వదలకపోతే... కుటుంబ సభ్యుల ఖాతాలోకి జీతం

ఆంధ్రప్రదేశ్​లో మద్యం సేవించే ఆర్టీసీ ఉద్యోగులపై యాజమాన్యం దృష్టి సారించింది. మత్తుకు బానిసైన ఉద్యోగులకు కౌన్సెలింగ్​ నిర్వహించాలని తాజాగా ఆదేశాలిచ్చింది. అలాగే వారికి అందాల్సి జీతాన్ని భార్యకు లేదా కుటుంబ సభ్యుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

drinking-drivers-salary-will-be-credited-to-his-wife-or-family-members-and-coun-celling-centres-wil-start
మత్తు వదలకపోతే... కుటుంబ సభ్యుల ఖాతాలోకి జీతం

By

Published : Jun 27, 2020, 12:19 PM IST

ఏపీఎస్ ​ఆర్టీసీలో మద్యం మత్తులో విధులకు హాజరయ్యే ఉద్యోగులను ఆ వ్యసనం నుంచి దూరం చేసేందుకు యాజమాన్యం కొత్త ఆలోచన చేసింది. అటువంటి ఉద్యోగికి అందాల్సిన జీతాన్ని వారి భాగస్వామి లేక కుటుంబ సభ్యుల ఖాతాలో జమ చేస్తామని తెలిపింది. హాజరయ్యే ఉద్యోగుల కుటుంబీకులకు తొలుత లేఖరాసి డిపో వద్దకు పిలుస్తారు. అక్కడ ఉద్యోగితోపాటు వారికి కౌన్సెలింగ్​ ఇస్తారు. అవసరమైతే జిల్లా కేంద్రాలకు తీసుకెళ్లి చికిత్స అందించాలని సూచిస్తారు.

ఇలా కౌన్సెలింగ్​ ఇచ్చేందుకు ప్రతి డిపోలో అయిదుగురు మహిళా ఉద్యోగులతో ఒక్కో బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. నిర్దేశిత ప్రమాణాల కంటే ఎక్కువ మద్యం తీసుకొని విధులకు హాజరైన 50 మందిని 2019 సంవత్సరంలో తొలగించారు. ఈ కౌన్సెలింగ్​ ప్రక్రియ తదితరాలను అమలు చేయాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు తాజాగా ఆదేశాలిచ్చారు.

ఇవీచూడండి:గ్రేటర్‌లో కరోనా పంజా... మూతబడుతోన్న కార్యాలయాలు

ABOUT THE AUTHOR

...view details