సికింద్రాబాద్ తార్నాక డివిజన్ లాలాపేటలో నాలా ప్రవాహం ఉద్ధృతంగా ఉంది. ఈ ప్రవాహానికి ఐదు ఇళ్ల గోడలు కూలాయి. నాచారం ఈఎస్ఐ ఆసుపత్రి నీట మునిగింది. దీంతో వైద్య సేవలు అందక రోగులు అవస్థలు పడ్డారు. కూకట్‌పల్లి జాతీయరహదారిపై ఉన్న బస్సు డిపో వద్ద వాహనాలు నిలిచిపోయాయి.
లాలాపేటలో ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న నాలా - లాలాపేటలో ప్రవహిస్తోన్న నాలా నీరు
సికింద్రాబాద్ తార్నాక డివిజన్ లాలాపేటలో నాలా ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దాని ధాటికి ఐదు ఇళ్ల గోడలు కూలిపోయాయి. కంటోన్మెంట్‌లోని అసుల్‌పూర్, చోలా బాలన్‌రాయి ప్రాంతాలు జలమయమయ్యాయి. మెహదీపట్నంలోని పలుకాలనీల్లో భారీ చెట్లు నేలకొరిగాయి. చర్లపల్లి డివిజన్ ఆఫీసర్‌కాలనీ జలదిగ్భందంలో ఉండిపోయింది.
లాలాపేటలో ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న నాలా
కంటోన్మెంట్‌లోని అసుల్‌పూర్, చోలాబాలన్‌రాయి ప్రాంతాలు జలమయమయ్యాయి. మెహదీపట్నంలోని పలుకాలనీల్లో భారీ చెట్లు నేలకొరిగాయి. చర్లపల్లి డివిజన్ ఆఫీసర్‌కాలనీ జలదిగ్భందంలో ఉండిపోయింది. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి వద్ద గుడిసెల్లో ముగ్గురు చిక్కుకున్నారు. వారిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు.
ఇదీ చదవండి:హైదరాబాద్‌లో నిలిచిన విద్యుత్, టెలిఫోన్, ఇంటర్నెట్ సేవలు