వారిద్దరికీ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నప్పటి నుంచి పరిచయం. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. తొమ్మిదేళ్ల తర్వాత మహేశ్‌ను పెళ్లి చేసుకోమని అడగగా ఇంట్లో ఎలా ఒప్పిస్తావంటూ ఆమె ప్రశ్నించింది. తాను ఐపీఎస్‌గా సెలెక్ట్ అయితే ఇంట్లో వారి అంగీకారం లభిస్తుందని చెప్పి పెళ్లి చేసుకున్నారు. ఏడాది తర్వాత మహేష్ ఐపీఎస్‌గా ఎంపికయ్యాడు. అప్పుడే అతని ప్రవర్తనలో మార్పు వచ్చిందని బాధితురాలు వాపోతోంది. కట్నం ఇవ్వాలంటూ వేధించడం ప్రారంభించాడని ఆరోపించింది. అదనపు కట్నం తీసుకొస్తేనే కాపురం చేస్తానని లేకపోతే వేరే అమ్మాయిని వివాహమాడతానని ఆమెను బెదిరించాడని చెబుతూ...రంగారెడ్డి జిల్లా కీసరలోని జవహర్‌నగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు..మహేశ్ రెడ్డిపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు.
ట్రైనీ ఐపీఎస్‌పై వరకట్న వేధింపుల కేసు - DOWRY HARASSMENT CASE BOOKED ON TRAINEE IAS
తొమ్మిదేళ్లు చెప్పలేనంత ప్రేమ పంచాక పెళ్లి చేసుకున్నాడు. భర్త మీద నమ్మకంతో అతన్ని ఉద్యోగం చేయనివ్వకుండా ఐపీఎస్‌ని చేసింది. కానీ ఉద్యోగం వచ్చాక కట్నం తీసుకొస్తేనే కాపురం చేస్తానంటూ వేధింపులకు గురిచేస్తున్నాడని ఆ మహిళ రంగారెడ్డి జిల్లా కీసరలోని జవహర్‌నగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది.
DOWRY HARASSMENT CASE BOOKED ON TRAINEE IAS IN RANGA REDDY KEESARA
Last Updated : Oct 29, 2019, 4:50 PM IST
TAGGED:
CASE BOOKED ON TRAINEE IAS