తెలంగాణ

telangana

ETV Bharat / state

నేటి నుంచే " దోస్త్​" ప్రక్రియ ప్రారంభం - education

రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కళాశాల్లో ప్రవేశానికి ఆన్​లైన్​ సర్వీసెస్​ తెలంగాణ (దోస్త్​) దరఖాస్తులు ప్రక్రియ నేటి నుంచి మొదలుకానుంది. మూడు విడతల్లో ప్రవేశాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ఉన్నత విద్యాశాఖ కాలపట్టిక విడుదల చేసింది.

దోస్త్​ నేటి నుంచి

By

Published : May 23, 2019, 5:15 AM IST

నేటి నుంచే " దోస్త్​" ప్రక్రియ ప్రారంభం
డిగ్రీ కళాశాల్లో ప్రవేశానికి డిగ్రీ ఆన్​లైన్​ సర్వీసెస్​ తెలంగాణ(దోస్త్​) దరఖాస్తుల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రంలో 1049 కాలేజీలు దోస్త్​ పరిధిలో ఉండగా వాటిలో మూడు విడతల్లో ప్రవేశాలు జరగనున్నాయి. బుధవారం ఉన్నత విద్యామండలి ఛైర్మన్​ తుమ్మల పాపిరెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్​ రెడ్డి, దోస్త్​ కన్వీనర్​ ఆచార్య లింబాద్రి తదితరులు కాలపట్టికను విడుదల చేశారు.ఇంటర్​ సప్లమెంటరీ ఫలితాలు వచ్చిన తర్వాత అందులో పాసైన వారి కోసం ప్రత్యేక రిజిస్ట్రేషన్​, కౌన్సిలింగ్​కు అవకాశం కల్పిస్తామని పాపిరెడ్డి తెలిపారు.

ఈసారి విశ్వవిద్యాలయాల్లో డిమాండ్​ లేని కోర్సులపై దృష్టి పెట్టి సీట్లకు కోత విధించామని చెప్పారు. ఈ ఏడాది 27 ప్రైవేట్​, 20 మైనారిటీ కళాశాలలు దోస్త్​లో చేరలేదన్నారు.సీట్ల సంఖ్యను ఒకటి రెండు రోజుల్లో వెల్లడిస్తామని దోస్త్​ కన్వీనర్​ ఆచార్య లింబాద్రి తెలిపారు. సీటు పొందినవారు ప్రభుత్వ కళాశాల అయితే రూ. 500, ప్రైవేట్​ కాలేజీల్లో బోధన రుసుం రానివారు ఫీజులో 50 శాతం చెల్లించి రిజర్వ్​ చేసుకోవచ్చన్నారు.

మార్పులు చేర్పులు

గతేడాది మీసేవతోపాటు ఆధార్​ అనుసంధానమైన చరవాణి ద్వారా విద్యార్థులు రిజిస్ట్రేషన్లు చేసుకునేవారు. ఈసారి 82 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 7 విశ్వవిద్యాలయాల్లోని 92 సహాయ కేంద్రాల్లో రిజిస్ట్రేషన్​ చేసుకోవచ్చు. కొంత మందికి రిజిస్ట్రేషన్​ సమయంలో వేలిముద్ర నమోదు కావడం లేదు. వారికోసం పాత 10 జిల్లాల్లోని సహాయ కేంద్రాల్లో ఐరిస్​ సౌకర్యం కల్పించారు. సీట్ల కేటాయింపు తర్వాత కాలేజీకి వెళ్లి రిపోర్టు చేయడం, రుసుం చెల్లించడం కాకుండా ఎంసెట్​ తరహాలో ఆన్​లైన్​లో సెల్ఫ్​ రిపోర్టింగ్​ విధానం అమలు చేయనున్నారు.

రిజిస్ట్రేషన్​ వెబ్​ ఆప్షన్లు సీట్ల కేటాయింపు రిపోర్టింగ్​
మొదటి విడత మే 23 నుంచి జూన్​ 3 వరకు మే 25 నుంచి జూన్​ 3 వరకు జూన్​ 10 జూన్​10 నుంచి 15 వరకు
రెండో విడత జూన్​ 10 నుంచి జూన్​15 వరకు జూన్​ 10 నుంచి జూన్​ 15 వరకు జూన్​ 20 జూన్​ 20 నుంచి జూన్​ 25 వరకు
మూడో విడత జూన్​ 20 నుంచి జూన్​ 25 వరకు జూన్​ 20 నుంచి జూన్​ 25 వరకు ​జూన్​ 29 జూలై1 నుంచి జూలై 4 వరకు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details