తెలంగాణ

telangana

ETV Bharat / state

'హీరా గ్రూప్స్ స్థిరాస్తులు కొనకండి'

హీరా గ్రూప్ ఆస్థులపై సీసీఎస్ హెచ్చరిక జారీచేసింది. వారి స్థిరాస్తులను ఎవరూ కొనుగోలు చేయవద్దని చెప్పింది. ఇప్పటివరకు పోలీసులు గుర్తించిన గ్రూప్ ఆస్థులకు జియో ట్యాగ్ చేస్తున్నారు.

HEERAGROUP

By

Published : Jul 5, 2019, 9:58 AM IST

హీరా గ్రూప్స్ స్థిరాస్తులను ఎవరూ కొనుగోలు చేయొద్దని సీసీఎస్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆ సంస్థకు చెందిన 110కి పైగా ఆస్తులను ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, హైదరాబాద్ ప్రాంతాల్లో పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఆయా స్థలాల వద్ద హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేసి.. వాటిని జియో ట్యాగింగ్ చేశారు. వీటి విలువ 400కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ప్రభుత్వ అనుమతితో ఆయా ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఐతే హీరా గ్రూప్స్ ఆస్తులు.. వివాదంలో ఉన్నాయని తెలియక.. కొనుగోలు చేసే అవకాశం ఉన్నందున... పోలీసు ఉన్నతాధికారులు ఈ మేరకు సూచనలు చేస్తున్నారు.

బంగారంలో పెట్టుబడుల పేరుతో ఎక్కువ వడ్డీ ఇస్తామని ఆశ చూపి హీరా గ్రూప్స్ ఎండీ నౌహీరా షేక్ మదుపుదారులను మోసం చేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు... దర్యాప్తు జరుపుతున్నారు.

'హీరా గ్రూప్స్ స్థిరాస్తులు కొనకండి'

ఇవీ చూడండి:పుర'పోరు'కు రంగం సిద్ధం

ABOUT THE AUTHOR

...view details