కరోనా వైరస్ లాంటి వాటిని గతంలో మనం ఎన్నో చూశామని... పెద్దగా భయపడాల్సిందేమీ లేదని సినీ కథానాయిక సమంత అన్నారు. భారతీయుల్లో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ మేరకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందన్నారు. హైదరాబాద్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన హెల్దీవే బై ఆర్యన్ రెస్టారెంట్‌ను సమంత ప్రారంభించారు. పలు రకాలైన సరికొత్త ఆహార రుచులను అరగిస్తూ... సందడి చేశారు.
ఫిట్‌నెస్‌పై దృష్టిసారించాలి...
ప్రస్తుతం ఫిట్‌నెస్ అనేది నిత్య జీవితంలో కీలకంగా మారిందని సమంత అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాలని కోరారు. ప్రస్తుతం శాకాహారంలో విభిన్న వంటకాలను ట్రై చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. నాకు స్ఫూర్తి అంటూ ఎవరు లేరని.. నన్ను కలిసే ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒక అంశం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తానని స్పష్టం చేశారు.
ఆరోగ్యం ఫిట్ నెస్‌పై జాగ్రత్తలు తీసుకోవాలి : సమంత ఇవీ చూడండి : ముఖ్యమంత్రికి రక్షణగా నారీశక్తి