హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యులు ఆందోళన చేస్తున్నారు. సేవ్ ఓజీహెచ్.. బిల్డ్ న్యూ ఓజీహెచ్ పేరుతో వైద్యులు నిరసన తెలుపుతున్నారు. శిథిలావస్థలో ఉన్న ఉస్మానియా ఆస్పత్రి భవనం కూల్చివేతను అడ్డుకోవడం అవివేకమని అన్నారు. ఆస్పత్రికి వచ్చే ప్రజలు, తమ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యుల ఆందోళన - ఉస్మానియా ఆస్పత్రి వార్తలు
ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనాలను కట్టాలని వైద్యులు ఆందోళనకు దిగారు. 2015లో ఆస్పత్రిని సీఎం కేసీఆర్ పరిశీలించి నూతన భవన నిర్మాణానికి ఆదేశాలిచ్చారని డాక్టర్లు గుర్తు చేశారు. నూతన భవన నిర్మాణాన్ని కొంతమంది అడ్డుకున్నారని... ఎవరైనా అడ్డుపడితే సహించేది లేదని తేల్చి చెప్పారు.
osmania hospital
2015లో ఆస్పత్రిని సీఎం కేసీఆర్ పరిశీలించి నూతన భనన నిర్మాణానికి ఆదేశాలిచ్చారని గుర్తు చేశారు. నూతన భవన నిర్మాణాన్ని కొంతమంది అడ్డుకున్నారని... ఎవరైనా అడ్డుపడితే సహించేది లేదని డాక్టర్లు తేల్చిచెప్పారు. ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనాలను కచ్చితంగా కట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
Last Updated : Jul 21, 2020, 1:25 PM IST