తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఉస్మానియా ఆస్పత్రి దుస్థితికి ప్రతిపక్షాలే కారణం' - ఉస్మానియా ఆస్పత్రిలోకి వర్షం నీరు

నేటి ఉస్మానియా ఆస్పత్రి దుస్థితికి ప్రతిపక్షాలే కారణమని మంత్రి ఈటల ఆరోపించారు. 2015లోనే ఉస్మానియాకు కొత్త భవంతి కట్టాలని సీఎం భావించగా ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని పేర్కొన్నారు. ఉస్మానియా ఆస్పత్రి వార్డుల్లోకి వర్షం నీరు చేరడంపై మంత్రి ఈటల వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశమయ్యారు.

do-you-know-why-sewage-water-reached-osmania-hospital-hyderabad
ఉస్మానియా ఆస్పత్రిలోకి అందుకే మురుగు నీరు చేరిందంటా!

By

Published : Jul 16, 2020, 9:19 PM IST

హైదరాబాద్​ ఉస్మానియా ఆస్పత్రిలోకి వర్షం నీరు చేరడంపై మంత్రి ఈటల వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం జరిపారు. అధికారులు ఉస్మానియాలో పర్యటించి పరిశీలించిన విషయాలను మంత్రికి నివేదిక రూపంలో అందించారు. బేగం బజార్ నుంచి మూసికి వెళ్లే వరద నీటి నాలా ఉస్మానియా ఆస్పత్రి భూగర్భం నుంచి వెళుతుందన్నారు. అది బ్లాక్ కావడం వల్లనే ఉస్మానియాలోకి నీళ్లు వచ్చాయని అధికారులు వివరించారు. జీహెచ్​ఎంసీ, డిజాస్టర్ మేనేజ్​మెంట్ వారితో కలిసి నీరు మొత్తం తీసివేశామని చెప్పారు. శాశ్వత పరిష్కారం దిశగా పని చేస్తున్నామని మంత్రికి వివరించారు.

ఖులీ ఖుతుబ్ షా భవనంలో 200 పడకలను సిద్ధం చేసి ఉస్మానియా పాత ఆస్పత్రిలో ఉన్న రోగులను అక్కడికి తరలించామని మంత్రి చెప్పారు. ప్రతిపక్ష నేతలు బురద రాజకీయం చేయవద్దని ఈటల సూచించారు. కరోనా రోగులకు మెరుగైన చికిత్స అందించేందుకు సర్కారు అహర్నిశలు కృషి చేస్తోందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో డీఎంఈ రమేష్ రెడ్డి, టీఎస్​ఎమ్​ఐడీసీ చీఫ్ ఇంజీనీర్ లక్ష్మారెడ్డి సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి :'నిర్లక్ష్యం వల్లే ఉస్మానియా ఆస్పత్రికి ఈ దుస్థితి'

ABOUT THE AUTHOR

...view details