DK Shiva Kumar Election Campaign Telangana : కర్ణాటకలో వచ్చిన ఫలితమే తెలంగాణలో వస్తుందని కర్ఱాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం, సమష్టి నాయకత్వం ఎక్కువని అన్నారు. హైదరాబాద్‌లోని ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దేశమే కాదు ప్రపంచమంతా తెలంగాణ ఎన్నికల వైపు చూస్తోందని చెప్పారు. తాను తెలంగాణలో అనేక నియోజకవర్గాల్లో తిరిగానని.. బీఆర్ఎస్(BRS) పాలనతో ప్రజలు విసిగిపోయారని అన్నారు.
DK Shiva Kumar on Congress Party Development :తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ(Soniaya Gandhi)కి బహుమతి ఇచ్చే అవకాశం వచ్చిందని డీకే శివకుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పాలన కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో డిసెంబర్ 9న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. కర్ణాటకలో కాంగ్రెస్(Congress) ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. కర్ణాటక రైతుల(KARNATAKA FARMERS)కు తమ ప్రభుత్వం ఉచిత కరెంట్ ఇవ్వడం ప్రారంభించామని వెల్లడించారు.
కేసీఆర్‌ను ఓడించి - పర్మినెంట్‌గా ఫాంహౌస్‌కు పంపించాలి : డీకే శివకుమార్
DK Shiva Kumar Comments on KCR :కర్ణాటకలో నిత్యవసర ధరలు పెరిగాయని ఆరోపణ చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు తమ రాష్ట్రం వచ్చి చూడాలని శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రజలకు 5 గ్యారంటీలు అమలు అవుతున్నాయని స్పష్టం చేశారు. రాష్ట్రం ఇస్తే పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని మాట తప్పారని కేసీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించి ఉందని.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో అవసరం ఉంటుందని అన్నారు. రాష్ట్ర ప్రజలకు అనుగుణంగా పథకాలు ఉంటాయని తెలిపారు.