రాష్ట్రంలో న్యాయవాదులకే రక్షణ లేకపోతే... సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రశ్నించారు. పెద్దపల్లి జిల్లాలో జరిగిన వామనరావు దంపతుల హత్యపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు.
'రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదు.. సీబీఐ విచారణ జరిపించండి' - తెలంగాణ వార్తలు
పెద్దపల్లి జిల్లాలో నడిరోడ్డుపై జరిగిన న్యాయవాద దంపతుల దారుణ హత్యను భాజపా ఖండిస్తుందని డీకే అరుణ తెలిపారు. రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని... సీబీఐ విచారణ జరపించాలని డిమాండ్ చేశారు.
'రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదు.. సీబీఐ విచారణ జరిపించండి'
న్యాయవాదుల హత్యను భాజపా తీవ్రంగా ఖండిస్తుందని వెల్లడించారు. ముమ్మాటికీ ఇది ప్రభుత్వం చేసిన హత్యే అని ధ్వజమెత్తారు. రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని... సీబీఐ విచారణ జరిపించాలన్నారు. స్థానిక పోలీసులు కేసు నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చూడండి:న్యాయవాద దంపతుల కేసులో మలుపులు... బయటపడుతున్న నిజాలు...!