తెలంగాణ

telangana

ఈ నెల 28 నుంచి సూపర్ స్ప్రెడర్లకు టీకాల పంపిణీ

By

Published : May 25, 2021, 1:59 PM IST

Published : May 25, 2021, 1:59 PM IST

Updated : May 25, 2021, 7:54 PM IST

మంత్రి హరీశ్​రావు సమీక్ష
మంత్రి హరీశ్​రావు సమీక్ష

13:57 May 25

ఈ నెల 28 నుంచి సూపర్ స్ప్రెడర్లకు టీకాల పంపిణీ

రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్​ను ప్రభుత్వం వేగవంతం చేసింది. సూపర్ స్ప్రెడర్లను గుర్తించడం కోసం విధివిధానాలు ఖరారు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆదేశాలతో... మంత్రి హరీశ్‌రావు అధికారులతో సమావేశమయ్యారు. దాదాపు 30 లక్షల మంది సూపర్ స్ప్రెడర్లు ఉన్నట్లు గుర్తించారు. వీరికి ఈ నెల 28 నుంచి టీకాలు వేయాలని నిర్ణయించారు. మొదట జీహెచ్​ఎంసీలోని ఆటో డ్రైవర్లు, బస్ డ్రైవర్లకు హోటల్స్, సెలూన్లు, కూరగాయల వ్యాపారులకు విడతల వారీగా టీకాలు వేయనున్నారు. కిరాణా దుకాణాదారులు, హమాలీలకు సైతం టీకాలు వేయాలని నిర్ణయించారు. 

మరోవైపు ప్రైవేట్ సంస్థల్లో వ్యాక్సినేషన్​కు వైద్యారోగ్యశాఖ అనుమతించింది. తమ సిబ్బందికి పని ప్రదేశాల్లో టీకాలు వేసేందుకు ప్రైవేటు సంస్థలకు అనుమతినిచ్చింది. వ్యాక్సినేషన్​కు ప్రైవేట్ ఆస్పత్రులతో సంస్థలు అనుసంధానం కావాలన్న అధికారులు... 18 ఏళ్లు నిండిన వారి వివరాలు కొవిన్ పోర్టల్​లో నమోదు చేయాలని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: మాజీ మంత్రి ఈటల భాజపాలో చేరుతున్నట్లు ఊహాగానాలు

Last Updated : May 25, 2021, 7:54 PM IST

ABOUT THE AUTHOR

...view details