గాంధీ ఆస్పత్రిలో అవుట్ సోర్సింగ్ విధులు నిర్వహిస్తున్న వారికి ఎన్95 మాస్కులు, శానిటైజర్, పీపీఈ కిట్లను ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు పంపిణీ చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బందికి తగిన రక్షణ కల్పించడం తమ బాధ్యత అని అన్నారు.
గాంధీ ఆసుపత్రి అవుట్సోర్సింగ్ సిబ్బందికి పీపీఈ కిట్ల పంపిణీ - వుట్సోర్సింగ్ సిబ్బందికి పీపీఈ కిట్ల పంపిణీ
రెండు రోజుల క్రితం గాంధీ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి కరోనా సోకడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. శనివారం అవుట్సోర్సింగ్ సిబ్బందికి ఎన్95 మాస్కులు, శానిటైజర్,తదితర వస్తువులను ఆసుపత్రి సూపరింటెండెంట్ అందజేశారు.
gandhi hospital latest news
ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న వారు కచ్చితంగా మాస్కులు, శానిటైజర్ వాడాలని ఆయన సూచించారు. రెండు రోజుల క్రితం విధులు నిర్వహిస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి కరోనా పాజిటివ్ రావడం వల్ల... అతనికి గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. కరోనాతో బాధపడుతున్న వారి బాగోగులు చూసుకునే బాధ్యత తమపై ఉందని ఆయన పేర్కొన్నారు.