లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తున్న అన్నార్తులకు అండగా నిలుస్తున్నాడు సికింద్రాబాద్‌కు చెందిన రిచర్డ్ అనే యువకుడు. గత వారం రోజులుగా ఆకలితో ఉన్న పలువురు పేదలకు అన్నదానం చేస్తూ తన దాతృత్వం చాటుకుంటున్నాడు.
నిత్యం 400 మంది అన్నార్తులకు ఆహారం పంపిణీ
లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న అన్నార్తులకు పలువురు దాతలు అండగా నిలుస్తున్నారు. తమ వంతు సాయంగా ఆహారం అందిస్తూ వారి ఆకలి తీరుస్తున్నారు. ఈ కష్టకాలంలో మేమున్నామంటూ ఆపన్నహస్తం అందిస్తున్నారు.
అన్నార్తులకు ఆహారం పంపిణీ
ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న రిచర్డ్ తన సొంత డబ్బులతో నిత్యం దాదాపు 400 మందికి అన్నదానం చేస్తున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని గాంధీ ఆసుపత్రి, ఉస్మానియా ఆసుపత్రి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో ఆహారం అందిస్తున్నట్లు తెలిపాడు. లాక్‌డౌన్ ముగిసేంత వరకు కార్యక్రమం కొనసాగిస్తానని వివరించారు.