ఆనందంతో కేరితంలు కొడుతూ... జలక్రీడల్లో మైమరిచిపోతున్న జనం ఒకవైపు, పిచ్చిమొక్కలు, తుప్పుపట్టిన క్రీడాపరికరాలు, కాలు పెట్టాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు మరోవైపు... మీరు చూస్తున్న రెండు ప్రాంతాలు వేర్వేరు కాదండోయ్, రెండూ ఒకటే అదే విజయవాడ నడిబోడ్డున ఉన్న సింగ్‌నగర్‌లోని డిస్నీల్యాండ్. 4 ఏళ్ల క్రితం వరకు నగరవాసులను అలరించిన డిస్నీల్యాండ్ ఇప్పుడు ఎలా ఉందో చూడండి.
1999లో విజయవాడ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో డిస్నీల్యాండ్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ విజయనగరవాసులకు ఆనందం, ఆహ్లాదం పంచేందుకు 1999లో విజయవాడ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ... సింగ్ నగర్‌లో 57 ఎకరాల స్థలంలో డిస్నీల్యాండ్ ఏర్పాటు చేశారు. చుట్టూ పచ్చని మొక్కలు, పక్షులతో ఎంతో ఆహ్లాదంగా ఉన్న ఈ ప్రాంతంలో వాకింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, సాహస క్రీడలు ఉండేవి. విజయవాడతోపాటు వివిధ జిల్లాల నుంచి వచ్చే పర్యాటకులతో నిత్యం సందడిగా ఉండేది. డిస్నీల్యాండ్‌ను 20 ఏళ్లపాటు సిబార్ సంస్థకు లీజుకు ఇచ్చారు. 4 ఏళ్లక్రితం లీజుగడువు ముగిసిన నాటి నుంచి కార్పొరేషన్ అధికారులు డిస్నీల్యాండ్‌ను పట్టించుకోవడం లేదు. లీజు గడువు పొడిగించకపోవడంతోపాటు....కొత్త టెండర్లు పిలవకుండా కాలయాపన చేస్తున్నారు. నిర్వహణలోపంతో డిస్నీల్యాండ్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.