సికింద్రాబాద్‌లోని బోయిన్పల్లి మార్కెట్లో ఏర్పాటు చేసిన డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్‌ను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. మార్కెట్‌కు పెద్ద సంఖ్యలో వచ్చే వారి కోసం దీన్ని ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చర్యల్లో భాగంగా రసాయనాలు వెదజల్లే టన్నెల్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
బోయిన్పల్లి మార్కెట్లో డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్
బోయిన్పల్లి మార్కెట్లో డిస్ ఇన్ఫెక్షన్ టన్నెల్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. దీనిని మంత్రి మల్లారెడ్డి ప్రారంభించి... పలు సూచనలు చేశారు.
బోయిన్పల్లి మార్కెట్లో డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్
సోడియం హైపోక్లోరైట్ రసాయన ద్రావణాన్ని ట్యాంకర్ ద్వారా టన్నెల్లోకి పంపి... పిచికారీ చేసే విధంగా తయారు చేశామని నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రభుత్వం అవకాశం ఇస్తే... ప్రతి రైతు బజారులో వీటిని ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఇవీ చూడండి:మిస్టరీగా మారిన సింగరేణి కార్మికుడు సంజీవ్ అదృశ్యం