విచారణ కమిషన్ ముందు దిశ నిందితుల కుటుంబ సభ్యులు - disha case
13:07 March 05
విచారణ కమిషన్ ముందు దిశ నిందితుల కుటుంబ సభ్యులు
దిశ కేసులో నిందితుల కుటుంబ సభ్యులు విచారణ కమిషన్కు వాంగ్మూల ప్రమాణ పత్రాలు సమర్పించారు. హైకోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ కార్యాలయంలో మహమ్మద్ ఆరిఫ్, చింతకుంట చెన్నకేశవులు, జొల్లు శివ, జొల్లు నవీన్ కుటుంబ సభ్యులు ఇవాళ అఫిడవిట్లు సమర్పించారు. పోలీసులు బూటకపు ఎన్ కౌంటర్లో కాల్చి చంపారని.. తమకు పరిహారం చెల్లించాలని మృతుల కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
పరిహారం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే.. కమిషన్ను సంప్రదించాలని ఆదేశించిందని వివరించారు. ఓ వైపు డబ్బులిస్తామని ప్రలోభ పెడుతున్నారని.. మరోవైపు బెదిరిస్తున్నారని.. తమ ప్రాణాలకు ముప్పు ఉన్నందున... రక్షణ కల్పించాలని కోరారు. చెన్నకేశవులు తండ్రి అనుమానాస్పద మృతిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరారు.