తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్​లో.. పీకే టెన్షన్ - హైదరాబాద్ తాజా వార్తలు

Telangana Congress: రాష్ట్ర కాంగ్రెస్‌లో ఎవరిని కదిలించినా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ గురించే చర్చ జరుగుతోంది. అతను ఎవరి గెలుపు కోసం పని చేస్తాడు తెరాస కోసమా, హస్తం కోసమా అనే ప్రశ్న నడుస్తోంది. కాంగ్రెస్‌లో చేరి నాయకుడిగా ఉంటాడా సోనియాగాంధీతో భేటీ తర్వాత కేసీఆర్​ను ఎందుకు కలిశారు. అసలు పార్టీలో ఏం జరుగుతుందో తెలియక పార్టీ శ్రేణులు తికమకపడుతున్నారు. పార్టీ అధిష్ఠానం పీకేతో ఏం మాట్లాడిందో తెలియక కొందరు నాయకులు అయోమయానికి గురవుతున్నారు.

Telangana Congress
తెలంగాణ కాంగ్రెస్

By

Published : Apr 25, 2022, 4:30 AM IST

Updated : Apr 25, 2022, 10:41 AM IST

తెలంగాణ కాంగ్రెస్​లో.. పీకే టెన్షన్

Telangana Congress: కాంగ్రెస్​లో ఇప్పుడిప్పుడే నాయకులంతా ఒకతాటిపైకి వచ్చి రాహుల్‌ గాంధీ పర్యటనను, ముఖ్యంగా వరంగల్‌ బహిరంగ సభను విజయవంతం చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్లుతున్నారు. రేవంత్‌ రెడ్డి, ముఖ్యనాయకులు అంతా వరుస సమీక్షలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే పనిలో ఉన్నారు. ఇదే సమయంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలువడం కాంగ్రెస్‌ నేతల్లో గుబులు రేపుతోంది.

ప్రశాంత్ కిశోర్‌ ఇటీవల సోనియాగాంధీని కలిసి దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి ఏవిధంగా ఉందో తెలియచేసినట్లు తెలుస్తోంది. పవర్​పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇవ్వడంతోపాటు ఓ నివేదిక అందచేసినట్లు సమాచారం. అంతకు ముందే ముఖ్యమంత్రి కేసీఆర్​తో కలిసి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తిరిగి సీఎంను కలువడం కాంగ్రెస్‌ నాయకులను కలవరపాటుకు గురి చేస్తోంది.

కాంగ్రెస్‌, తెరాస.. పీకే అన్నచందంగా రాజకీయ చదరంగం

కాంగ్రెస్‌, తెరాస.. పీకే అన్నచందంగా రాజకీయ చదరంగం నడుస్తోంది. తాజా పరిస్థితులు తెలిసిన ప్రతి ఒక్కరికి ప్రశాంత్ కిశోర్ ఎవరితో ఉన్నారు అన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మొన్నటికి మొన్న కాంగ్రెస్ అధిష్టానంతో నాలుగు సార్లు సమావేశమయ్యారు. ఇప్పుడు సడన్​గా హైదరాబాద్ లో ప్రత్యక్షం అయ్యారు. సీఎం కేసీఆర్​తో రెండు రోజుల పాటు ఆయన జరిపిన చర్చలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్​గా మారాయి.

దీంతో అలెర్ట్ అయిన టీకాంగ్రెస్ నేతలు నష్టనివారణ చర్యలకు దిగారు. పీకే ఇష్యూలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గులాబీ బాస్ చేస్తున్న పొలిటికల్ డ్రామాలో ఇదో పార్ట్ అంటున్నారు.కేసీఆర్​తో డీల్ రద్దు కోసమే పీకే ప్రగతి భవన్ భేటీ అంటూ స్పష్టత ఇస్తున్నారు.కాంగ్రెస్​లో ప్రశాంత్ కిశోర్ చేరడం ఖాయం అంటున్నారు.

పీకే చేరికను సోనియా, రాహుల్ గాంధీ, ప్రియాంక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్​లో చేరేందుకు సంసిద్దం అవుతున్నారు. అయితే పార్టీలో చేరే ముందు ఇతర పార్టీలతో పనిచేసేందుకు కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలని పీకేకు సుచించింది. హైకమాండ్ చెప్పిన షరతులకు ఓకే చెప్పిన ఆయన రెండు వారాల సమయం కోరారు. దానికోసం ఇప్పటికే అగ్రిమెంట్​లు చేసుకున్న ప్రాంతీయ పార్టీలతో డీల్ క్యాన్సిల్ చేసుకునే పనిలో పడ్డారు. అందులో భాగంగానే తెరాసతో కుదుర్చుకున్న ఒప్పందం రద్దు కోసం కేసీఆర్​తో సమావేశమయ్యారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

ప్రశాంత్ కిశోర్ వివిధ ప్రాంతీయ పార్టీలతో చేసుకున్న డీల్స్ రద్దు చేసుకొని కాంగ్రెస్​లో చేరి తనతోపాటు ఇప్పటివరకు పనిచేసిన సభ్యులకు ఐ ప్యాక్ సేవలు కొనసాగేలా సర్దుబాటు చేసేపనిలో పడ్డారని సమాచారం. అందుకోసమే ఆయన కేసిఆర్​తో రెండు రోజులుగా సమావేశం అవుతున్నారని చెప్పుకొస్తున్నారు. రాష్ట్రంలో తెరాసతో కాంగ్రెస్ పొత్తు ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు.

ఒకవేళ ప్రశాంత్ కిశోర్​తో ఉన్న సాన్నిహిత్యంతో పొత్తు ప్రయత్నాలు చేసినా అది అసాధ్యమని కొట్టిపారేస్తున్నారు. ఇదే విషయాన్ని ఇప్పటికే ఏఐసీసీ ఇంఛార్జ్ మాణికం ఠాగూర్ క్లారిటీ ఇచ్చారని వివరిస్తున్నారు. ఇక మే6న వరంగల్​లో జరిగే సభలో కూడా రాహుల్ పొత్తుల మీద స్పష్టత ఇచ్చే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. ఓటమి భయంతో ఉన్న కేసిఆర్ పీకె సర్దుబాటు సమావేశాలను కూడా లీకులు ఇచ్చి.. కాంగ్రెస్ శ్రేణులను కన్ఫ్యూజ్ చేస్తున్నారని విమర్శిస్తున్నారు. త్వరలో ప్రశాంత్ కిశోర్ దీని మీద క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.

ఇదీ చదవండి:Rahul Gandhi Tour: రాహుల్‌ సభకు భారీ జనసమీకరణపై కాంగ్రెస్​ దృష్టి!

లతామంగేష్కర్​ అవార్డ్ అందుకున్న​ ప్రధాని.. దేశప్రజలకు అంకితం

Last Updated : Apr 25, 2022, 10:41 AM IST

ABOUT THE AUTHOR

...view details