కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్టును తమిళనాడు ఎంపీ మాణిక్యం ఠాకూర్ తప్పుబట్టారు. లోక్‌సభ సమావేశాలు జరుతున్న సమయంలో అరెస్టు చేయడాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు.
రేవంత్ రెడ్డి అరెస్టును పార్లమెంటులో ప్రస్తావించిన తమిళనాడు ఎంపీ - రేవంత్ అరెస్టుపై తెరాస ఎంపీ నామ నాగేశ్వరరావు సమాధానం
మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్టుపై లోక్‌సభలో తమిళనాడు కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ ప్రస్తావించారు. అక్రమంగా అరెస్టు చేశారని సభ దృష్టికి తీసుకెళ్లారు.
ఎంపీ మాణిక్యం వ్యాఖ్యలను తెరాస ఎంపీలు నామ నాగేశ్వరరావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అడ్డుకునేందుకు యత్నించారు. డ్రోన్ ద్వారా చిత్రీకరణకు రేవంత్ ప్రోత్సహించారని, అవకాశం ఇస్తే రేపు ప్రధాన మంత్రి ఇంటిపైనా డ్రోన్లు ఎగురవేస్తారని ఎంపీ నామ సభకు వివరించారు.
ఎంపీ నామ మాట్లాడుతుండగా అడ్డుకున్న కాంగ్రెస్ ఎంపీలు.. రాజకీయ కారణాలతో రేవంత్ రెడ్డిని అరెస్టు చేయడం అనైతికమన్నారు. రేవంత్‌ను విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు.