తెలంగాణ

telangana

ETV Bharat / state

DIKSHANT PARADE: జాతీయ పోలీస్ అకాడమీలో దీక్షాంత్ సమారోహ్ - తెలంగాణ వార్తలు

జాతీయ పోలీస్ అకాడమీలో దీక్షాంత్ సమారోహ్(DIKSHANT PARADE) నిర్వహించారు. 72వ బ్యాచ్‌కు చెందిన 178 మంది ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ హాజరయ్యారు. పాసింగ్ ఔట్ పరేడ్‌లో ఆయన గౌరవ వందనం స్వీకరించారు.

DIKSHANT PARADE in hyderabad, national police academy DIKSHANT PARADE
జాతీయ పోలీస్ అకాడమీలో దీక్షాంత్ సమారోహ్, హైదరాబాద్‌లో దీక్షాంత్ పరేడ్

By

Published : Aug 6, 2021, 10:09 AM IST

దేశ భద్రత కోసం అనేకమంది పోలీసులు ప్రాణాలు అర్పించారని.... కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ పోలీసులు ఫ్రంట్ వారియర్లుగా ముందున్నారని.... కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌రాయ్ అన్నారు. హైదరాబాద్ జాతీయ పోలీస్ అకాడమీలో జరిగిన ప్రొబేషనరీ ఐపీఎస్‌ల దీక్షాంత్ సమారోహ్‌లో(DIKSHANT PARADE)... ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 72వ బ్యాచ్‌కు చెందిన 178 మంది అధికారులు దీక్షాంత్ సమారోహ్ నిర్వహించారు. వీరిలో 144 మంది ఐపీఎస్‌లు, 34 మంది విదేశీ అధికారులు ట్రైనీలున్నారు.

ఈ బ్యాచ్‌లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన రంజితాశర్మకు ప్రధానమంత్రి బ్యాటన్, హోంమంత్రి రివాల్వర్‌ను.... కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అందించారు. ఈ బ్యాచ్‌లో 23మంది మహిళా ఐపీఎస్‌లు(IPS) ఉండటం సంతోషకరమని... ఈ సంఖ్య మరింత పెరగాలని నిత్యానంద్‌రాయ్ అన్నారు. ఉగ్రవాదం, తీవ్రవాదం వంటి వాటిని నిర్మూలించడంలో నూతన ఐపీఎస్‌లు తమవంతు పాత్ర పోషించాలని సూచించారు. నిజాయతీ, క్రమశిక్షణ, నిబద్ధతతో మెలిగి మంచి పేరు తెచ్చుకోవాలని కోరారు.

తెలుగు రాష్ట్రాలకు 8 మంది ప్రొబేషనరీ ఐపీఎస్‌లను కేటాయించారు. తెలంగాణకు నలుగురు, ఏపీకి నలుగురిని కేటాయించారు. దీక్షాంత్ సమారోహ్‌కు రంజితా శర్మ నేతృత్వం వహించారు.

జాతీయ పోలీస్ అకాడమీలో దీక్షాంత్ సమారోహ్

ఇదీ చదవండి:Tokyo Olympics: మహిళా హాకీ జట్టు ఓటమి..కాంస్యమూ దక్కలేదు

ABOUT THE AUTHOR

...view details