'మహానాడు'లో పసందైన వంటకాలు.. చూస్తే నోరూరాల్సిందే..! MAHANADU FOOD: రెండ్రోజుల పాటు....వేలాదిమందికి ఆతిథ్యం ఇవ్వబోతోంది తెలుగుదేశం మహానాడు..! మరి వారికి అసౌకర్యం కలిగితే ఎలా..? ఈ విషయంపైనే....చంద్రబాబు దృష్టి పెట్టారు. పార్టీపై గౌరవం, అభిమానంతో మహానాడుకు వచ్చే వేలాదిమందిపై....అంతే గౌరవం చూపాలని నిర్ణయించారు. మహానాడు పేరుతో జరిపే ఈ పండుగలో....అతిథులు, అభిమానులకు, కార్యకర్తలు, అధినాయకులకు...జిహ్వ చాపల్యం తీర్చే విధంగా..వంటకాలు సిద్ధం చేయిస్తున్నారు.
మహానాడుకు తరలివచ్చే నాయకులు, కార్యకర్తలకు పసందైన విందు భోజనాలు సిద్ధం చేశారు. తెలుగు సంప్రదాయానికి అద్దం పట్టేలా ఆంధ్ర వంటకాలను అతిథుల కోసం వండి వారుస్తున్నారు. 12వేల మంది ప్రతినిధులు మొదటి రోజున సభకు వస్తారని అంచనా వేశారు. అయితే అంతకు రెట్టింపు సంఖ్యలో తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అతిథుల కోసం పూర్తిగా శాఖాహారం వంటకాలను వడ్డిస్తున్నారు. అనుకున్న సంఖ్య కంటే ఎక్కువ మంది తరలివచ్చినప్పటికీ ఎవరికీ ఇబ్బంది లేకుండా భోజన ఏర్పాట్లు చేసినట్లు నిర్వహకులు తెలిపారు. అదనంగా వచ్చిన వారి కోసం ఆహారాన్ని సిద్ధం చేస్తున్నారు.
ఒంగోలు సమీపంలో కనీవినీ రీతిలో నిర్వహిస్తున్న మహానాడులో.... అతిథులు, అభిమానులకు తెలుగుదేశం సాదర స్వాగతం పలుకుతోంది. పార్టీ 40 వసంతాల పండుగకు......నేతలు ఇప్పటికే సర్వం సిద్ధం చేశారు. రెండ్రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో.... తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే లక్షలాది మంది అభిమానులు, కార్యకర్తలను....పార్టీ అధిష్ఠానం గౌరవించుకుంటోంది. వేదికతో పాటు.....సభా ప్రాంగణం వద్ద వారు ఎలాంటి ఇబ్బందులకూ గురికాకుండా ఏర్పాట్లు చేశారు. అలానే...రుచి, శుచికరమైన వంటకాలు తయారు చేస్తున్నారు.
తాపేశ్వరం కాజా, ఒంగోలు అల్లూరయ్య మైసూర్ పాక్....ఇలా ప్రసిద్ధి చెందిన దాదాపు 30 మిఠాయిలు ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. విజయవాడ నుంచి ఇందుకోసం సుమారు వెయ్యి మందిని రప్పించారు. మహానాడు తోలిరోజున దాదాపు 30 వేలమంది, రెండో రోజు లక్షమందికి పైగా సరిపడా ఆహార పదార్థాలు వండుతున్నారు. సభావేదికకు పక్కనే ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అతిథులు అందరూ ఆహా అనేలా....తాపేశ్వరం కాజా తయారు చేయిస్తున్నారు. మహానాడుకు ఇప్పటికే......వివిధ ప్రాంతాలనుంచి అభిమానులు ఒంగోలుకు భారీగా చేరుకున్నారు.
ఇవీ చదవండి: