కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతుగా సీఎం సహాయనిధికి పలు సంస్థల అధిపతులు విరాళాలు అందజేశారు. వీటికి సంబంధించిన చెక్కులను ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. కాగా మార్చి 31న సీఎం సహాయ నిధికి మొత్తం రూ.8.72 కోట్ల విరాళాలు వచ్చాయి. దివీస్ లేబటేరరీస్ తరఫున రూ.5కోట్లు, గ్రాన్యూల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, విర్చా పెట్రో కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లు చెరో రూ.కోటిని సీఎం సహాయ నిధికి అందించారు.
ఐఆర్ఏ రియాల్టీ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున రూ. 25లక్షలు, ఎంజీబీ కమోడీటీస్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున రూ.20లక్షలు, మానవీయ డెవలప్మెంట్ అండ్ ఫైనాన్స్ లిమిటెడ్ తరఫున రూ.20లక్షలను అందించారు. మాధవరం కన్ స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, సింథోచెమ్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఓషన్ స్పార్కిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, భూపతిరాజు హెల్పింగ్ హ్యాండ్స్, మిరియాల చిన్న రాఘవరావులు రూ.10లక్షల చొప్పున సహాయనిధికి ప్రకటించారు.