తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ డిపోకు కర్ణాటక డీజిల్​ - రాయదుర్గం ఆర్టీసీ డిపోకు కర్ణాటక డీజిల్

Rayadurgam RTC Depo: ఏపీలోని అనంతపురం జిల్లా రాయదుర్గం ఆర్టీసీ డిపోకు కర్ణాటక నుంచి డీజిల్​ వస్తున్నట్లు అనుమానంతో సేల్స్‌ టాక్స్ అధికారులు ఓ డీజిల్​ ట్యాంకర్​ను పట్టుకున్నారు. డీజిల్​ ట్యాంకర్​ డ్రైవర్​ను పట్టుకుని విచారించగా అసలు నిజాలు బయటకు వచ్చాయి.

Rayadurgam RTC Depot Karnataka Diesel
Rayadurgam RTC Depot Karnataka Diesel

By

Published : Nov 24, 2022, 9:56 PM IST

Rayadurgam RTC Depo: ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా రాయదుర్గం ఆర్టీసీ డిపోకు కర్ణాటక నుంచి డీజిల్​ వస్తున్నట్లు అనుమానంతో సేల్స్‌ టాక్స్ అధికారులు ఓ డీజిల్​ ట్యాంకర్​ను పట్టుకున్నారు. డీజిల్​ ట్యాంకర్​ డ్రైవర్​ను పట్టుకుని విచారించగా అసలు నిజాలు బయటకు వచ్చాయి. ఆర్టీసీ డిపోకు కర్ణాటక నుంచి డీజిల్ కొనుగోలు చేసినట్లు డిపో మేనేజర్ సురేష్ వెల్లడించారు. సేల్స్‌ టాక్స్ అధికారులు డిపోకు సరఫరా చేసిన డీజిల్ ట్యాంకర్‌ను తనిఖీ చేసినట్లు చెప్పారు. బహిరంగ మార్కెట్​లో లీటర్ డీజిల్ 99 రూపాయల 63పైసలు కాగా.. పెద్ద మొత్తంగా కొనుగోలు చేసినట్లయితే లీటర్ మీద 2 రూపాయలు తగ్గింపు ఉంటుందని తెలిపారు. అందుకే కర్ణాటక నుంచి డీజిల్ కొనుగోలు చేసినట్లు సురేష్ వివరించారు.

ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ డిపోకు కర్ణాటక డీజిల్​

ABOUT THE AUTHOR

...view details