DGP Mahender Reddy : గతేడాదితో పోలిస్తే ఈసారి రాష్ట్రంలో 4.6శాతం నేరాలు పెరిగాయని... డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర పోలీస్ వార్షిక నేర నివేదిక-2021 విడుదల చేసిన ఆయన... శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్‌శాఖ సఫలీకృతమైందని పేర్కొన్నారు. కొవిడ్ సమయంలోనూ పోలీసులు ప్రజలకు అండగా ఉంటూ, బాధ్యతాయుతంగా నిలిచారని అభినందించారు. మావోయిస్టు రహిత రాష్ట్రంలా ఉండాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని... సమర్థవంతంగా అమలు చేశామని పేర్కొన్నారు. మత ఘర్షణలు లేకుండా పోలీసులు నిరంతరం పనిచేస్తున్నారన్న డీజీపీ...సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యామని అన్నారు. నగరాల్లో 5 నిమిషాల్లో సంఘటనాస్థలాలకు చేరుకోవడంతోపాటు... షీ టీమ్స్ ద్వారా మహిళలకు ప్రత్యేక భద్రత కల్పిస్తున్నామని స్పష్టం చేశారు.
శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్‌శాఖ పూర్తిస్థాయిలో సఫలీకృతమైంది. రాష్ట్రాన్ని నేర, మావోయిస్టు రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పోలీస్‌శాఖ పనిచేస్తోంది. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశం మేరకు పోలీస్‌శాఖ పనిచేస్తోంది. గతేడాదితో పోలిస్తే 4.65 శాతం నేరాలు పెరిగాయి. పేద, ధనిక తేడా లేకుండా పోలీస్‌శాఖ పనిచేస్తోంది. 800 పోలీస్‌స్టేషన్లలో రిసెప్షన్ కౌంటర్లు ప్రారంభించాం.
-మహేందర్ రెడ్డి, డీజీపీ
మత ఘర్షణల రహిత రాష్ట్రంగా..
మత ఘర్షణలు లేకుండా నిరంతరం పని చేస్తున్నామన్న డీజీపీ... ఏడేళ్లుగా ఎలాంటి మత ఘర్షణలు జరగలేదని తెలిపారు. నిర్మల్ జిల్లా భైంసాలోనే చిన్న గొడవలు జరిగాయిని అన్నారు. 98 మావోయిస్టులను అరెస్టు చేశామని... 133 మంది మావోయిస్టులు లొంగిపోయారని వెల్లడించారు. 50.3 శాతం కేసుల్లో నేరగాళ్లకు శిక్షలు పడ్డాయని.. 80 కేసులో 126 మందికి జీవిత ఖైదు పడిందని పేర్కొన్నారు.