రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ఏకరూప సేవలందించేందుకు ‘‘ఒక రాష్ట్రం-ఒకే సర్వీస్’’ అనే విధానాన్ని అవలంభిస్తున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. నూతన సంవత్సరంలో ఏకరూప సేవలు అందించడం, సైబర్ నేరాలు నిరోధించడమే ప్రాథమ్యాలుగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు.
కొత్త ఏడాదిలో 'ఒక రాష్ట్రం ఒకే సర్వీస్ విధానం'
రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్లలో 'ఒక రాష్ట్రం ఒకే సర్వీస్’ విధానాన్ని అమలుచేస్తున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. సైబర్ నేరాల నియంత్రణే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు.
కొత్త ఏడాదిలో 'ఒక రాష్ట్రం ఒకే సర్వీస్ విధానం'
డీజీపీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీనియర్ పోలీసు అధికారులు, డీజీపీ కార్యాలయ సిబ్బంది సమక్షంలో మహేందర్ రెడ్డి కేక్ కట్ చేశారు. సైబర్ నేరాల నియంత్రణకు సరికొత్త లక్ష్యాలను ఎంచుకున్నట్లు పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో ప్రతి పోలీసుకు అవగాహన కల్పించనున్నట్లు డీజీపీ వివరించారు.
ఇదీ చూడండి :'ప్రభుత్వం అనుమతిస్తే వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధం'