భారత్ బంద్ పిలుపుతో ఎస్పీలు, కమిషనర్లతో డీజీపీ మహేందర్ రెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. శాంతి, భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
రాజకీయ పార్టీలు చేపట్టిన భారత్ బంద్ సందర్భంగా ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. రాష్ట్రంలోని పోలీస్ కమీషనర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలన్నారు.