నిమజ్జనోత్సవాలకు సంబంధించి మూడు కమిషనరేట్ల పరిధిలో పటిష్ట బందోబస్తుకు ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ మహేందర్రెడ్డి తెలిపారు. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 50 ప్రాంతాల్లో నిమజ్జనాలకు ఏర్పాట్లు చేశామన్నారు. అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు అమర్చినట్లు తెలిపారు. అన్నిశాఖల సమన్వయంతో... సాధారణ పౌరులకు ఇబ్బందిలేకుండా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. 3 కమిషనరేట్లలో కలిపి 35 వేల మంది పోలీసు బలగాలను వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. శోభాయాత్రలో గొడవలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలుంటాయని డీజీపీ హెచ్చరించారు. నిమజ్జనం పూర్తయిన విషయాన్ని కూడా మండపం నిర్వాహకులు పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
3 కమిషనరేట్లలో 35 వేలమంది పోలీసులతో బందోబస్తు...
3 కమిషనరేట్ల పరిధిలో సుమారు 35 వేల మంది పోలీసుల బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీజీపీ మహేందర్రెడ్డి పేర్కొన్నారు. నిమజ్జనోత్సవాలు జరిగే అన్ని ప్రాంతాల్లో నిఘానేత్రాలు అమర్చినట్లు తెలిపారు. అన్ని ఠాణాలతోపాటు డీజీపీ కార్యాలయంలోనూ కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి పరిస్థితులు సమీక్షించనున్నట్లు వివరించారు.
DGP Mahender Reddy on immersion arrangements