హైదరాబాద్ నాగోల్‌లోని జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆడిటోరియంలో రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో పోలీసులకు పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. దీనికి డీజీపీ మహేందర్ రెడ్డి హాజరయ్యారు. తప్పు చేసిన వారికి శిక్ష పడుతుందనే నమ్మకం పోలీసులు ప్రజలకు కల్పించాలని ఆయన పేర్కొన్నారు. కేసులను త్వరగా దర్యాప్తు చేసి నిందితులకు శిక్షలు పడేలా చూడాలని సూచించారు.
తప్పు చేయాలంటేనేే నేరస్థులు భయపడాలి: డీజీపీ
ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పోలీసులు పనిచేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. చట్టాలను ఉల్లంఘించిన వారికి శిక్షలు తర్వితగతిన పడేలా చూడాలని వెల్లడించారు. వివిధ నేరాల్లో నిందితులకు శిక్షలు పడేలా వ్యవహరించిన పోలీసులకు ఆయన పురస్కారాలు అందజేశారు.
తప్పు చేసిన వారికి శిక్ష పడుతుందనే నమ్మకం పోలీసులు కల్పించాలి
రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నేరాల దర్యాప్తులో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో రాచకొండ కమిషనర్ మహేశ్‌భగవత్, ప్రాసిక్యూషన్ సంచాలకురాలు వైజయంతి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :గడ్డిఅన్నారం మార్కెట్ యార్డు.. కోహెడకు తరలింపు
TAGGED:
రాచకొండ పోలీసు కమిషనరేట్