తెలంగాణ

telangana

ETV Bharat / state

ఒక స్త్రీ బాధ మరొక స్త్రీకే తెలుస్తోంది: డీజీపీ

ఒక స్త్రీ బాధ మరొక స్త్రీకే తెలుస్తోంది డీజీపీ మహేందర్​ రెడ్డి అన్నారు. హైదరాబాద్​ మోఘల్​పురా పోలీసులు అనాథ మహిళతోపాటు మూడు నెలల పాపను శిశుసదన్ తరలించారు. తినలేని స్థితిలో ఉన్న ఆమెకు మహిళ కానిస్టేబుల్​ ఆహారం తినిపించారు. ఈ విషయమై పోలీసులను అభినందిస్తూ డీజీపీ ట్వీట్​ చేశారు.

dgp mahender reddy appreciate mogalpura police in hyderabad
ఒక స్త్రీ బాధ మరొక స్త్రీకే తెలుస్తోంది: డీజీపీ

By

Published : Sep 13, 2020, 11:03 AM IST

హైదరాబాద్​ మోఘల్​పురాలో ఓ అనాథ మహిళ చేతిలో మూడు నెలల పాపను పట్టుకొని భిక్షాటన చేస్తు జీవనం సాగిస్తోంది. వారిని గమనించిన మోఘల్​పురా పోలీసులు శిశుసదన్​కు తరలించారు.

తినలేని స్థితిలో ఉన్న ఆ మహిళకు మోఘల్​పురా పోలీస్ స్టేషన్​కు చెందిన మహిళ కానిస్టేబుల్ ఆహారం తినిపించారు. ఈ దృశ్యాన్ని ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. ఈ ఫొటో చూసి స్పందించిన తెలంగాణ డీజీపీ మహేందర్​ రెడ్డి.. ఒక స్త్రీ మాత్రమే మరొక స్త్రీ బాధను అర్థం చేసుకోగలదని ట్వీట్​ చేశారు. మోఘల్​పురా పోలీసులను అభినందించారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో కొత్తగా 2,216 కరోనా కేసులు, 11 మరణాలు

ABOUT THE AUTHOR

...view details