సంపాదనే ధ్యేయంగా కొందరు వ్యక్తులు మహిళలను వ్యభిచారంలోకి దింపుతున్నారని.. అలాంటి వారు ఆస్తులు జప్తు చేసి.. వారిని ఆర్థికంగా దెబ్బ తీయాలని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. మానవ అక్రమ రవాణాపై హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు దీని నివారణ కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. మానవ అక్రమ రవాణాను హేయమైన చర్యగా డీజీపీ పేర్కొన్నారు. పేదరికాన్ని ఆసరాగా తీసుకుని.. మహిళలను వ్యభిచారంలోకి దింపుతున్నారని చెప్పారు. అంతర్జాలంలో జరుగుతున్న హైటెక్ వ్యభిచారానికీ అడ్డుకట్ట వేసేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అంతర్జాలంలో హైటెక్ వ్యభిచారానికి అడ్డుకట్ట వేస్తాం: డీజీపీ - మానవ అక్రమ రవాణా
మానవ అక్రమ రవాణా నివారణకు కఠినమైన చర్యలు తీసుకునే అంశంపై దృష్టి పెట్టాలని పోలీసులు డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సులో ఆయన పాల్గొన్నారు.
మానవ అక్రమ రవాణాపై రాష్ట్ర స్థాయి సదస్సు