తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆంధ్రప్రదేశ్​కి అడుగు పెట్టాలంటే... అనుమతులు తప్పనిసరి'

ఆంధ్రప్రదేశ్​లో అడుగు పెట్టే వారికి అనుమతి తప్పనిసరని ఆ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. థర్మల్ స్క్రీనింగ్ చేశాకే అనుమతిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు, ఆంక్షలు కొనసాగుతాయన్నారు.

dgp-comments-on-lock-down
'ఆంధ్రప్రదేశ్​కి రావాలంటే... అనుమతులు తప్పనిసరి'

By

Published : Jul 1, 2020, 9:45 AM IST

Updated : Jul 1, 2020, 10:48 AM IST

ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారికి థర్మల్‌ స్క్రీనింగ్‌ చేశాకే రాష్ట్రంలోకి అనుమతి ఇస్తామని ఆ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. కరోనా వ్యాప్తి చెందుతున్న క్రమంలో ఏపీ సరిహద్దుల్లో చెక్‌పోస్టులు, ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. రాష్ట్రానికి వచ్చే వారు కచ్చితంగా అనుమతి తీసుకోవాలని తెలిపారు. స్పందన ద్వారా దరఖాస్తు చేసుకొని పాస్‌ పొందాలని డీజీపీ సూచించారు.

పాస్‌ ఉన్న వారిని ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకు మాత్రమే అనుమతిస్తామని పేర్కొన్నారు. ఆ తరువాత వస్తే అనుమతి లేదని స్పష్టం చేశారు. రాత్రివేళల్లో అత్యవసర, నిత్యావసర సర్వీసులు మాత్రం కొనసాగుతాయని తెలిపారు. పరిస్థితిని అర్థం చేసుకుని ప్రజలు సహకరించాలని సూచించారు.

ప్రజలు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకుని కరోనా బారిన పడకుండా జాగ్రత్త వహించాలని డీజీపీ కోరారు. బయటికు వస్తే మాస్క్ తప్పనిసరి.. కొవిడ్ నిబంధనలు అందరూ పాటించాలని సూచించారు.

ఇదీ చదవండి:ప్రయాణిస్తుండగా చెలరేగిన మంటలు... ఆహుతైన స్కోడాకారు

Last Updated : Jul 1, 2020, 10:48 AM IST

ABOUT THE AUTHOR

...view details