మహాశివరాత్రిని పురస్కరించుకుని హైదరాబాద్ పాతబస్తీలోని కిషన్బాగ్ కాశీ బుగ్గ దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులు మహాశివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శివరాత్రి ప్రత్యేకం: కిక్కిరిసిపోయిన కాశీ బుగ్గ ఆలయం - mahashivarathri news
హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని కాశీబుగ్గ దేవాలయానికి భక్తుల తాకిడి పెరిగింది. రద్దీ దృష్ట్యా ఎలాంటి అవాంతరాలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.
కిక్కిరిసిపోయిన కాశీ బుగ్గ ఆలయం
పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఆలయానికి చేరాలంటే మూసీ నదిలో నుంచి నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుండటంతో మూసీ నదిపై ఫూట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని భక్తులు కోరుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా 70 మందితో బందోబస్తును ఏర్పాటు చేసినట్లు బహదూర్పూర్ ఎస్సై దుర్గాప్రసాద్ తెలిపారు.
ఇదీ చూడండి:పిల్లికి పాలుపోయాలంటూ... పక్కాగా ప్లాన్