తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫిబ్రవరి 1న ఎల్వీప్రసాద్​ ఆస్పత్రి ఆడిటోరియంలో పుస్తక ప్రదర్శన - development of annamacharya project in north america

పొరుగు దేశాల్లో అన్నమాచార్య సంగీత, సాహిత్య సంప్రదాయాన్ని విస్తృతం చేస్తున్నట్లు స్వప్న సంస్థ వ్యవస్థపాకులు తెలిపారు. తమ సంస్థ సేవలను వివరిస్తు స్వప్నా-32 పేరుతో ప్రచురించిన పుస్తకాన్ని ఫిబ్రవరి 1న ఎల్వీప్రసాద్​ కంటి ఆస్పత్రి ఆడిటోరియంలో నిర్వహించబోయే పుస్తక ప్రదర్శనలో అందుబాటులో ఉంచుతామని సంస్థ నిర్వాహకులు తెలిపారు.

Annamacharya_Project
ఫిబ్రవరి 1న ఎల్వీప్రసాద్​ ఆస్పత్రి ఆడిటోరియంలో పుస్తక ప్రదర్శన

By

Published : Jan 29, 2020, 11:26 PM IST

ఫిబ్రవరి 1న ఎల్వీప్రసాద్​ ఆస్పత్రి ఆడిటోరియంలో పుస్తక ప్రదర్శన

అమెరికా దేశంలోని చికాగో నగరంలో భారతీయ కళలకు, అన్నమాచార్య సంగీత సాహిత్య నృత్య సంప్రదాయాలను కాపాడటంలో గత 32 ఏళ్లుగా ఎనలేని సేవలు అందిస్తున్నట్లు స్వప్న సంస్థ వ్యవస్థాపకులు తెలిపారు. తమ సంస్థ చేస్తున్న సేవలను వివరిస్తూ... "స్వప్నా-32" పేరుతో ప్రచురించిన పుస్తకాన్ని ఈ నెల 28న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించినట్లు సంస్థ ఛైర్మన్​ డాక్టర్​ శ్రీరామ్​ సొంటి, వ్యవస్థాపకురాలు శారదా పూర్ణ సొంటి తెలిపారు.

ఈ పుస్తకాన్ని ఫిబ్రవరి 1న బంజారాహిల్స్​లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ఆడిటోరియంలో నిర్వహించబోతున్న పుస్తక ప్రదర్శన కార్యక్రమంలో ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు డా.ఎం.హరికృష్ణ తదితరులు పాల్గొంటారని తెలిపారు.

ఇదీ చూడండి: తెలంగాణ కుంభమేళాకు జాతీయ హోదా దక్కేదెప్పుడు?

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details