బ్రిటన్‌లోని ఒక బ్యాంకులో ఉన్న 3.50 కోట్ల పౌండ్ల (సుమారు రూ.332 కోట్లు) సొమ్ముకు సంబంధించి న్యాయస్థానం వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ హైదరాబాద్ నిజాం వారసులు మరోసారి లండన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సొమ్ముపై భారత్‌కు, ఎనిమిదో నిజాంకు, ఆయన సోదరునికి అనుకూలంగా గత ఏడాది లండన్‌లోని రాయల్ కోర్టు తొలుత తీర్పునిచ్చింది.
నిజాం వారసులు లండన్ హైకోర్టుకు ఎందుకు వెళుతున్నారు? - london
నిజాం వారసులు బ్రిటన్లో ఒక బ్యాంకులో ఉన్న సొమ్ముకు సంబంధించి న్యాయస్థానం వెలువరించిన తీర్పును సవాలు చేస్తూ మరోసారి లండన్ హైకోర్టును ఆశ్రయించారు. డబ్బుకు లబ్ధిదారుడు ఎవరో మునుపటి తీర్పులోనే చెప్పామని న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేసింది.
దానిని ఏడో నిజాం వారసులు 116 మంది తరఫున నజాఫ్ అలీఖాన్ సవాల్ చేశారు. ఏడో నిజాం ఎస్టేట్ పరిపాలకుడు తమ నమ్మకాన్ని వమ్ముచేశారని తెలిపారు. బ్యాంకులో ఉన్న డబ్బు విషయంలో ఇచ్చిన తీర్పు సబబు కాదని తెలిపారు. డబ్బుకు లబ్ధిదారుడు ఎవరో మునుపటి తీర్పులోనే తేల్చిచెప్పామని, కేసును తిరగతోడడం అసాధ్యమని న్యాయమూర్తి స్మిత్ పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేశారు. అయితే ఏడో నిజాం ఎస్టేట్ పాలన వ్యవహారాల్లో అవకతవకలపై వాదనలు మాత్రం వింటామని చెప్పారు.
ఇవీ చూడండి: జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం... విద్యుత్ మీటర్ రీడింగ్ కార్మికులకు శాపం!