సికింద్రాబాద్లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఉపసభాపతి పద్మారావు గౌడ్ పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 140 మంది లబ్ధిదారులకు రూ. కోటీ 19 లక్షల విలువైన చెక్కులను అందించారు. పేద వర్గాలకు వివాహం భారం కాకూడదనే ఉద్దేశంతో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమల్లో తెలంగాణ ముందువరసలో ఉందన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఉపసభాపతి - deputy speaker padmarao goud distribute kalyana laxmi checks
సికింద్రాబాద్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎం సహాయనిధి చెక్కులను డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ లబ్ధిదారులకు అందించారు.
కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఉపసభాపతి
TAGGED:
padmarao goud