సికింద్రాబాద్ నియోజకవర్గం.. తెరాసకు ఆది నుంచే కంచు కోటగా నిలిచిందని ఉప సభాపతి పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. హైదరాబాద్, సీతాఫల్మండీలో.. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. పార్టీలో సభ్యులుగా చేరేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని వివరించారు.
సికింద్రాబాద్.. తెరాసకు కంచుకోట: పద్మారావు గౌడ్ - ఉప సభాపతి పద్మారావు గౌడ్
రాష్ట్ర వ్యాప్తంగా తెరాస చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. సీతాఫల్మండీలో ఏర్పాటు చేసిన నమోదు ప్రారంభ కార్యక్రమంలో.. ఉప సభాపతి పద్మారావు గౌడ్ పాల్గొని పార్టీ శ్రేణులకు సభ్యత్వం అందించారు. నమోదుకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు.
సికింద్రాబాద్.. తెరాసకు కంచుకోట: పద్మారావు గౌడ్
నమోదు ప్రక్రియలో కార్పొరేటర్లతో పాటు నేతలు చురుగ్గా పాల్గొనాలని కోరారు పద్మారావు. ఈ కార్యక్రమంలో.. కార్పొరేటర్లు సామల హేమ, కంది శైలజ, లింగాని ప్రసన్నలతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.