సికింద్రాబాద్ సీతాఫలమండి డివిజన్లో నామలగుండు బస్తీలో రూ.15 లక్షల ఖర్చుతో నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను ఉపసభాపతి పద్మారావు గౌడ్ ప్రారంభించారు. ఇప్పటికే ప్రారంభించిన అన్ని పనులను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులకు ఆదేశించారు.
అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయండి - ఉపసభాపతి తీగుల్ల పద్మారావు
సికింద్రాబాద్ పరిధిలో అన్ని అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అధికారులకు ఆదేశించారు.

అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయండి
ప్రజలు కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర సమయంలో బయటకు వస్తే మాస్కులు ధరించాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ హేమ, జీహెచ్ఎంసీ ఉప కమీషనర్ శ్రీ పల్లె మోహన్ రెడ్డి, స్థానిక నేతలు, స్థానిక సంఘం నాయకులు పాల్గొన్నారు.