Deputy CM Bhatti Vikramarka Press Meet on Formula E Race :ఫార్ములా ఈ రేస్ ద్వారా రాష్ట్రానికి ఎలాంటి ఆదాయం ఉండదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అన్నారు. ఒప్పందం ప్రకారం ప్రభుత్వం ట్రాక్ సదుపాయం ప్రభుత్వం కల్పించాలని చెప్పారు. గత ప్రభుత్వం ట్రై పార్టీ ఒప్పందాన్ని బై పార్టీ అగ్రిమెంట్‌గా మార్చారని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో ఈ ఫార్ములా ఈ రేస్ విషయంపై మీడియాతో మంత్రి భట్టి విక్రమార్క సమావేశం నిర్వహించారు.
ఈ ఫార్ములా ఈ రేస్(Formula E Race)కు సంబంధించి రూ.110 కోట్లు చెల్లించాలని, ఈ రేస్‌కు డబ్బులు చెల్లించి ప్రభుత్వం అనుమతులు ఇప్పించాలని ఒప్పందంలో ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇప్పటి వరకు ఫార్ములా ఈ రేస్‌కు సంబంధించి రూ.55 కోట్లు చెల్లించారని, మిగతా రూ.55 కోట్లు చెల్లించాలని ప్రభుత్వానికి నోటీసులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం బిజినెస్ రూల్స్‌కు భిన్నంగా తప్పిదం చేసిందని, రాష్ట్ర వనరులను వారికి తాకట్టు పెట్టిందని విమర్శించారు. ఫార్ములా ఈ రేస్ ట్రాక్ కోసం రూ.20 కోట్లు ఖర్చు చేశారు, ఇందులో హైదరాబాద్ రేసింగ్ లిమిటెడ్(Hyderabad Racing Limited) రూ.35 కోట్లు ఖర్చు పెట్టిందన్నారు.
ఆర్థిక శాఖపై మంత్రి భట్టి విక్రమార్క సమీక్ష - 'అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తే లక్ష్యాలు సాధిస్తాం'
రేస్ సందర్భంగా వారం, పది రోజులు రోడ్లు మూతపడతాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈ రేస్‌ను నిర్వహిస్తున్న ఏజెన్సీ కంపెనీ మాత్రం టికెట్లు అమ్ముకుని వెళ్లిపోయిందన్నారు. మిగతా రూ.55 కోట్లు చెల్లించాలని ప్రభుత్వానికి నోటీసులు వచ్చాయని, ఫార్ములా ఈ రేస్ వల్ల రాష్ట్రానికి ఎలాంటి ఆదాయం లేదన్నారు. ఫార్ములా ఈ రేస్‌కు చెల్లించాల్సింది ఏస్ నెక్ట్స్ జెన్ ఏజెన్సీ అని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై భారం వేసేలా రెండో ఒప్పందం చేసుకున్నారన్నారు. చెల్లింపుల విషయమై న్యాయ సలహా తీసుకుని ముందుకెళతామని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరికీ తల వంచమని స్పష్టం చేశారు. ఇతరులకు రాష్ట్ర సొత్తు ధారాదత్తానికి అంగీకరించమని వివరించారు.
Formula E Race Issue in Hyderabad : గత ప్రభుత్వం హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేస్ రాకపోవడం వల్ల నష్టం జరిగినట్లు ప్రస్తు ప్రభుత్వాన్ని విమర్శిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోలేదని ఆరోపిస్తున్నారన్నారు. ఫార్ములా ఈ రేస్ విషయమై గతంలో ట్రై పార్టీ అగ్రిమెంట్ జరిగిందని వివరించారు. రేస్ ద్వారా టికెట్లు అమ్ముకుని లబ్ధి పొందాలని ఏస్ నెక్ట్స్ జెన్ కంపెనీ యత్నించిందని చెప్పారు. ప్రభుత్వం, ఫార్ములా ఈ రేస్, ఏస్ నెక్ట్స్ జెన్, ప్రభుత్వం మధ్య ఒప్పందం జరిగిందని గుర్తు చేశారు.
గ్యారంటీల అమలు జరిగేలా బడ్జెట్ రూపకల్పన కోసమే ప్రజాపాలన దరఖాస్తులు : భట్టి విక్రమార్క
'తెలంగాణ ఆర్థిక పరిస్థితిని ప్రధానికి వివరించాం - విభజన చట్టంలో రావాల్సిన హక్కులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది'