తెలంగాణ

telangana

ETV Bharat / state

Registration Department: రిజిస్ట్రేషన్‌ శాఖలో ఈసీలు పొందడం ఇక సులభం

Registration ‌Department: రాష్ట్రంలో ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ (ఈసీ)లు పొందడాన్ని రిజిస్ట్రేషన్‌ శాఖ సులభతరం చేసింది. ఈసీల కోసం వివిధ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు తిరిగే పనిలేకుండా అన్ని సంవత్సరాలకు సంబంధించిన ఈసీలను ఆస్తి గల ప్రస్తుత సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలోనే పొందే విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది.

Encumbrance Certificate
ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌

By

Published : Apr 25, 2022, 9:02 AM IST

Registration Department: రాష్ట్రంలో ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ (ఈసీ)లు పొందడాన్ని రిజిస్ట్రేషన్‌ శాఖ సులభతరం చేసింది. ఈసీలను పొందడంలో ఉన్న ఇబ్బందులను గుర్తించిన రిజిస్ట్రేషన్‌శాఖ సుమారు నాలుగు దశాబ్దాల రిజిస్ట్రేషన్‌ల రికార్డులను కంప్యూటరీకరించడం ద్వారా పరిష్కారం చూపింది. సుదీర్ఘకాలంగా ఆస్తులు వివిధ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌లు అయ్యాయి.

రాష్ట్రంలో ప్రస్తుతం 141 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. వాటి పునర్‌వ్యవస్థీకరణకు ముందు ఆస్తి ఒక సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం పరిధిలో రిజిస్ట్రేషన్‌ కాగా అంతకుముందు అదే ఆస్తి వేరే చోటా రిజిస్ట్రేషన్‌ అయి ఉంటే గతంలో ఈసీ కోసం రెండు కార్యాలయాలకూ వెళ్లాల్సి వచ్చేది. ఇలా గతంలో రిజిస్ట్రేషన్‌ అయిన అన్ని ఆఫీసుల నుంచి ఈసీని విడివిడిగా తీసుకోవాల్సి వచ్చేది. నూతన విధానంలో తాజాగా ఆస్తి ఉన్న ప్రస్తుత రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలోనే అన్ని సంవత్సరాలకు సంబంధించిన ఈసీని తీసుకునే వెసులుబాటు కలిగింది.

ABOUT THE AUTHOR

...view details