హైదరాబాద్ నగరంలో భారీ వర్షాల కారణంగా శిథిలావస్థలో ఉన్న పురాతన భవనాలను కూల్చివేస్తున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ తెలిపారు. ప్రజలను రక్షించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టి శిథిలావస్థకు చేరిన భవనాల కూల్చివేత కొనసాగిస్తామన్నారు.
పురాతన భవనాలను కూల్చేస్తున్నాం: లోకేశ్‌కుమార్
హైదరాబాద్‌లో మునుపెన్నడు లేని విధంగా కురుస్తోన్న భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. శిథిలావస్థలో ఉన్న భవనాలను కూల్చివేత చేపట్టిన అధికారులు... ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
పురాతన భవనాలను కూల్చేస్తున్నాం: లోకేశ్‌కుమార్
వారం రోజుల్లో శిథిలావస్థలో ఉన్న 65 భవనాలను కూల్చివేసినట్లు పేర్కొన్నారు. ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నట్లు కమిషనర్ చెప్పారు. వర్షాలు పడుతున్నందున పురాతన భవనాలు ఖాళీ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి:విరాళాల వెల్లువలు... ఆపదలో సినీ ప్రముఖుల ఆపన్నహస్తం