హైదరాబాద్ మియాపూర్ న్యూ ఆఫీస్ పేటలోని సర్వే నంబర్ 80లో అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. ఇక్కడ 200 గజాల స్థలంలో అనుమతి లేకుండా ఆరు అంతస్తులు నిర్మిస్తున్నారు. కూల్చడానికి వెళ్లిన జీహెచ్ఎంసీ సిబ్బందిని స్థానికులు అడ్డుకున్నారు. పోలీసుల బందోబస్తు మధ్య నిర్మాణాలను పడగొట్టారు. అనుమతి లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని ఆదేశాలు ఉన్నప్పటికీ దాన్ని బేఖాతరు చేస్తూ ప్రజలు అక్కడ కట్టడాలు కొనసాగిస్తున్నారని అధికారులు తెలిపారు.
మియాపూర్‌లో అక్రమ కట్టడాల కూల్చివేత - ghmc
అక్రమ కట్టడాలపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది. హైదరాబాద్ మియాపూర్ న్యూ ఆఫీస్పేటలోని సర్వే నంబర్ 80లో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు.
కూలుస్తున్న సిబ్బంది
ఇవీ చూడండి: రోగుల మధ్య అటెండర్ల 'టిక్‌టాక్' చిందులు