తెలంగాణ

telangana

ETV Bharat / state

దేశంలో ప్రజాస్వామ్యం ఉంటుందా: చాడ

కేంద్రం 370 రద్దుకు తీసుకొచ్చిన బిల్లు ఏపక్షంగా ఉందంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఇంద్రజిత్‌ గుప్తా జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు.

చాడ వెంకట్​రెడ్డి

By

Published : Aug 25, 2019, 1:37 PM IST

దేశంలో తాజా పరిణామాలు చూస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్లు కనిపిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి అన్నారు. హైదరాబాద్ సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ​ఇంద్రజిత్‌ గుప్తా జయంతి ఉత్సవాల్లో భాగంగా 370 రద్దు-కశ్మీర్​ పరిణామాలపై సెమినార్​కు హాజరయ్యారు. ఆర్​ఎస్​ఎస్​ కనుసన్నుల్లో మోదీ.. ప్రభుత్వాని నడుపుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా, రాష్ట్ర నాయకులు అజీజ్​ పాషా, పల్లా వెంకట్​ రెడ్డి పాల్గొన్నారు.

దేశంలో ప్రజాస్వామ్యం ఉంటుందా: చాడ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details