తెలంగాణ

telangana

ETV Bharat / state

దిల్లీ మద్యం కేసు నిందితుల ఆస్తులు అటాచ్‌ చేసిన ఈడీ - దిల్లీ మద్యం కేసు నిందితుల ఆస్తులు అటాచ్‌

ED
ED

By

Published : Jan 24, 2023, 8:58 PM IST

Updated : Jan 24, 2023, 9:39 PM IST

20:52 January 24

దిల్లీ మద్యం కేసు నిందితుల ఆస్తులు అటాచ్‌ చేసిన ఈడీ

Delhi Liquor Scam Update: దిల్లీ మద్యం కేసు నిందితుల ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. ముగ్గురు నిందితుల స్థిరాస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేశారు. ఈ కేసులో నిందుతులైన సమీర్ మహేంద్రు, విజయ్‌ నాయర్‌ ఇళ్లను అటాచ్ చేశారు. అదే విధంగా దినేశ్‌ అరోరా రెస్టారెంట్‌ను ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ అధికారులు అటాచ్‌ చేశారు.

అంతకుముందు ఈ నెల మొదటివారంలో దిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీబీఐ దాఖలు చేసిన ఛార్డిషీట్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఒక్కొక్కరికి 50వేల వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసిన కోర్టు.. నిందితుల రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై సీబీఐకి నోటీసు జారీ చేసింది. బెయిల్‌ పొందిన వారిలో ఎక్సైజ్ శాఖ మాజీ అధికారులు కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్‌, ముత్తా గౌతమ్‌, అరుణ్‌ పిళ్లై, వ్యాపారవేత్త సమీర్‌ మహేంద్రులు ఉన్నారు.

ఈ కేసులో అభిషేక్, విజయ్ నాయర్​కు ఇదివరకే సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నవంబర్ 25న మద్యం కేసులో దాదాపు 10 వేల పేజీలతో తొలి చార్జ్‌షీట్ దాఖలు చేసిన సీబీఐ.. ఏడుగురు నిందితుల పేర్లను చార్జ్​షీట్​లో ప్రస్తావించింది. ఎక్సైజ్‌ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ నరేంద్ర సింగ్‌, ఎక్సైజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ కుల్‌దీప్‌ సింగ్‌, విజయ్‌ నాయర్‌, అభిషేక్‌ బోయిన్‌పల్లి, సమీర్‌ మహేంద్రు, అరుణ్‌ రామచంద్ర పిళ్లై, ముత్తా గౌతమ్‌ పేర్లను చార్జ్ షీట్ లో సీబీఐ పేర్కొంది.

ఇవీ చదవండి:

Last Updated : Jan 24, 2023, 9:39 PM IST

ABOUT THE AUTHOR

...view details