తెలంగాణ

telangana

ETV Bharat / state

ts rtc: ఆర్టీసీ ఆదాయానికి గండి.. తగ్గుతున్న బస్​పాస్​లు

ఆర్టీసీ పరిస్థితి దినదిన గండం నూరేళ్ల ఆయుష్షుగా మారింది. లాక్​డౌన్​తో డిపోలకే పరిమితమవ్వడం వల్ల ఆదాయం పూర్తిగా పడిపోయింది. నిబంధనల సడలింపుతో ఇప్పుడిప్పుడే రోడ్లపైకి వస్తున్నాయి. అయితే గతంలో ఉన్న ఆదాయ మార్గాలు చాలా వరకు తగ్గిపోయాయి. అందులో బస్​పాస్​లు ప్రధానమైనవి. బస్​పాస్​లతో ఆర్టీసీకి కచ్చితంగా ఆదాయం వచ్చేది. ముందుగానే డబ్బు చెల్లించి తీసుకుంటారు కాబట్టి కచ్చితంగా వచ్చేది. అయితే ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. స్కూళ్లు, కాలేజీలు లేకపోవడం, కరోనా పరిస్థితుల వల్ల బస్​పాస్​లు భారీగా తగ్గిపోయాయి.

rtc bus pass
rtc bus pass

By

Published : Jul 12, 2021, 6:57 PM IST

నగరంలో నిత్యం ప్రయాణం చేయాల్సివచ్చిన వారి వద్ద కచ్చితంగా బస్​పాస్ ఉండేది. అన్నిసార్లు టికెట్​ కొనుక్కునే అవసరం లేకపోవడం, మంత్లీపాస్​ తక్కువ ధరకే రావడం, సిటీ అంతా చుట్టొచ్చే సౌలభ్యం ఉండడం వల్ల బస్​పాస్​లు హాట్​కేకుల్లా అమ్ముడయ్యేవి. బస్​పాస్​ కౌంటర్ల దగ్గర ఎప్పుడూ జన కిక్కిరిసిపోయి ఉండేవారు. ఆర్టీసీకి కచ్చితమైన ఆదాయం వచ్చేది. అయితే ఇదంతా కొవిడ్​కు మందున్న పరిస్థితి. ఇప్పుడు అందుకు భిన్నంగా ఉంది.

భారీగా పడిపోయిన ఆదాయం

ఒకప్పుడు బస్​పాస్ కౌంటర్లు విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, కార్మికులు వివిధ రంగాలకు చెందిన ప్రయాణికులతో కళకళలాడేవి. ప్రస్తుతం బస్​పాస్​లు తీసుకునేవారులేక వెలవెలబోతున్నాయి. కరోనాకు ముందు గ్రేటర్ ఆర్టీసీకి నెలకు రూ.23 కోట్ల నుంచి రూ.24 కోట్ల ఆదాయం పాస్​ల రూపంలో వచ్చేది. ప్రస్తుతం రూ.15-16 కోట్లకు పడిపోయింది. దీనికి ప్రధాన కారణం పాఠశాలలు, కళాశాలలు నడకపోవడం. దీనితో పాటు లాక్​డౌన్​ల ప్రభావం, కరోనా భయంతో చాలా మంది సొంతంగా వాహనాలు కొనుక్కున్నారు. మెట్రో సౌకర్యం అందుబాటులోకి రావడం కూడా ఆర్టీసీ బస్​పాస్​లు తగ్గడంలో పాత్ర ఉంది.

కరోనా వల్ల బస్​పాస్​లు భారీగా తగ్గిపోయాయి. మాకు కలెక్షన్​ సరిగా రావడం లేదు. జీతాలు కూడా సక్రమంగా అందడం లేదు. మొదటిదశ కొవిడ్​ నుంచి కోలుకున్నామనుకునే సరికి రెండోదశ దెబ్బతీసింది. ఆర్టీసీ కండక్టర్​.

ఇదీ చూడండి:VAJRA service: ప్రయాణికులు లేరని వజ్ర బస్సులు అమ్మేస్తారట..

సొంతవాహనాలకే మొగ్గు

గతేడాదిలో కొవిడ్​ మొదటి దశ సమయంలో లాక్​డౌన్​ కారణంగా సుమారు ఏడు నెలల పాటు బస్సులు డిపో గేటు దాటలేదు. ఈ ఏడాది రెండోదశ సమయంలోను బస్సులు రోడ్డెక్కలేదు. బస్సులు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రయాణికులు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారు. చాలామంది సొంతంగా వాహనాలు కొనుక్కున్నారు. వాటితో పాటు ప్రైవేటు వాహనాల సంఖ్య పెరిగింది. దీనితో బస్​పాస్​లు కొనుక్కునేవారి సంఖ్య భారీగా తగ్గిపోయింది. విద్యార్థుల కోసమే గ్రేటర్ ఆర్టీసీ ప్రతి రోజూ 2,500పైగా ప్రత్యేక ట్రిప్పులు నడిపేదని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆ సంఖ్య చాలా వరకు తగ్గిపోయిందని తెలిపారు.

లాక్​డౌన్​ సమయంలో బస్సులు ఉండవు. బస్​పాస్​ తీసుకుంటే ఆమొత్తం వృథా అవుతుంది. అందుకే బస్​పాస్​లు తీసుకునేవారి సంఖ్య తగ్గిపోయింది. వీలైతే సొంతంగా వాహనాలు కొనుక్కుంటున్నారు. లేకపోతే రోజువారి టికెట్​ కొనుక్కుంటున్నారు. - సరస్వతి, ప్రయాణికురాలు.

ప్రస్తుతం విద్యార్థులు ఆన్​లైన్ చదువులకు పరిమితమయ్యారు. చాలా వరకు విద్యాసంస్థలు ఆర్టీసీ గుర్తింపును రద్దుచేసుకున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. జీజీటీ ఆర్టీనరి పాస్​కు రూ.950, మెట్రో పాస్​కు రూ.1,070లు, స్టూడెంట్​పాస్​కు రూ.165, ఎన్జీఓ పాస్​కు రూ.360 చొప్పున ఆర్టీసీ పాస్​లు జారీ చేస్తుంది. గ్రేటర్ పరిధిలో సాధారణ బస్​పాస్​లు 3.5 లక్షల మంది వినియోగిస్తారని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

కొవిడ్​ ప్రభావం వల్ల బస్​లలో ప్రయాణించేవారి సంఖ్య తగ్గిపోయింది. ఎక్కువమంది సొంతవాహనాల్లోనే వెళ్తున్నారు. ప్రస్తుతం మెట్రోకంటే ఆర్టీనరీ సర్వీసుల్లోనే కొంచెం నయం. బస్​పాస్​ల సంఖ్య భారీగా తగ్గిపోయింది. స్కూళ్లు, కాలేజీలు ఉంటే ఎక్కువ పాస్​లు ఉండేవి. -శ్రీలత, ఆర్టీసీ కండక్టర్​.

ఈదశలో కొవిడ్​ మూడోదశ వార్తలు రావడం వల్ల బస్సులు ఎప్పుడు ఆగిపోతాయో అనే భయంతో బస్సుపాస్​లు తీసుకునేవారు వెనకడుగు వేస్తున్నారు. రోజురోజుకు పాస్​లు తీసుకునేవారి సంఖ్య తగ్గిపోతుంది. ఈ పరిస్థితి నుంచి గట్టేక్కే మార్గం కనిపించడం లేదు.

ఇదీ చూడండి:TSRTC: ఖాళీగా ఉంచడానికి వీలుకాదు.. వదులుకోడానికి మనసు రాదు

ABOUT THE AUTHOR

...view details