ప్రస్తుతం చిన్నారుల నుంచి పెద్దల వరకు ఆరోగ్య మంత్రం జపిస్తున్నారు. ప్రతి ఒక్కరిలో ఫిట్‌నెస్‌పై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పంజాగుట్టలోని మోట్రోమాల్‌లోని ప్రముఖ స్పోర్ట్స్ సంస్థ డెకథ్లోన్ శరీరక వ్యాయమంతో పాటు సైక్లింగ్ ర్యాలీని నిర్వహించింది. సంస్థ స్టోర్స్‌ను ప్రారంభించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో దాదాపు 300 మంది యువతి, యువకులు ఉత్సహాంగా పాల్గొన్నారు. ఎర్రమంజిల్‌లోని ఆ సంస్థ నుంచి నెక్లస్రోడ్ వరకు సైక్లింగ్‌తో పాటు ఫిట్నెస్ కార్యక్రమం చేపట్టింది. ప్రస్తుతం మారుతున్న జీవన ప్రమాణాలతో పాటు ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం అవసరమని తెలియజేయాలనే లక్ష్యంతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు.
'300 మందితో ఫిట్నెస్ ర్యాలీ' - FITNESS
మారుతున్న జీవన ప్రమాణాలతో పాటు ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి. అందుకే ప్రముఖ స్పోర్ట్స్ సంస్థ డెకథలాన్ 300 మంది యువతి, యువకులతో నగరంలో సైక్లింగ్ ర్యాలీని నిర్వహించింది.
FITNESS RALLY IN HYDERABAD