సైబరాబాద్ కమిషనరేట్ మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని షమా, రోషన్ కాలనీల్లో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని ఇరవై ద్విచక్ర వాహనాలు,ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శంషాబాద్ జోన్ డీసీపీ ప్రకాష్ రెడ్డి,రాజేంద్రనగర్ ఏసీపీ అశోకచక్రవర్తి ఆధ్వర్యంలో 200మంది పోలీసులతో తనిఖీలు నిర్వహించారు. ఇళ్లను అద్దెకు ఇచ్చేవారు తీసుకునే వారి పూర్తి వివరాలు తెలుసుకున్నాకే అద్దెకు ఇవ్వాలని డీసీపీ సూచించారు. స్థానిక ప్రజల్లో భద్రతభావం పెంపొందించడం, నేరాలను తగ్గించటం కోసమే తనిఖీలు నిర్వహిస్తున్నామని ప్రకాశ్‌రెడ్డి అన్నారు.
మైలార్దేవుపల్లిలో నిర్భంధ తనిఖీలు - rajendra nagar
మైలార్దేవుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని కాలనీల్లో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఇరవై ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు.
మైలార్దేవుపల్లిలో నిర్భంధ తనిఖీలు