"ఓటర్ల తుది జాబితా ప్రచురణకు గడువు పెంపు" - నగరపాలక సంఘాలు
త్వరలోనే రాష్ట్రంలో జరగనున్న పురపాలక ఎన్నికలకు సంబంధించి ఓటర్ల తుది జాబితా ప్రచురణకు ఎన్నికల సంఘం గడువు పొడిగించింది. తుది ప్రక్రియ ప్రచురణకు మరికొంత గడువు కోరిన పాలనాధికారుల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఓటర్ల తుది జాబితా ప్రచురణకు మరో రెండు రోజులు పొడిగింపు
పురపాలక ఎన్నికల్లో ఓటర్ల తుది జాబితా ప్రచురణకు గడువు మరో రెండు రోజులు పెంచుతూ ఆదివారం రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న 129 పురపాలక సంఘాలు, మూడు నగరపాలక సంస్థల్లో ఓటర్ల తుది జాబితా నేడు ప్రచురించాల్సి ఉంది. ఈ గడువును మంగళవారం వరకు పెంచుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.