Data Privacy Lab in Hyderabad :డేటా భద్రతకు కేంద్రం ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని డేటా ప్రైవసీ ల్యాబ్ ఏర్పాటు చేసినట్లు జీరో ల్యాబ్స్ సీఈఓ హ్రిషికేష్ తెలిపారు. గతేడాది గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందంలో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలతో డేటా భద్రత కోసం ప్రత్యేక ల్యాబ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆయన వెల్లడించారు. డేటాకు రక్షణ లేక ఎన్నో సంస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, వ్యక్తిగత డేటా లీక్ అవుతున్న ఘటనలు ఎన్నో చూస్తున్నామని అన్నారు.
Data Privacy Awareness :"విద్య, పరిశోధనకు సంబంధించిన అంశాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని, ఈ విషయాలు బయటకు పొక్కితే యువత నష్టపోవాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలతో సమన్వయం చేసుకొనిడేటా ప్రైవసీ ల్యాబ్‌ను ఏర్పాటు చేశాం. డేటా భద్రతపై చాలా సంస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. దీనివల్ల ఎన్నో మోసాలు జరిగే అవకాశం ఉంటుంది. డేటాలీక్ అవడం వల్ల వినియోగదారుల భద్రత ప్రమాదంలో పడుతుంది. సైబర్ నేరగాళ్లు మార్కెట్‌లో వ్యక్తిగత వివరాలు సేకరించి నేరాలకు పాల్పడుతున్నారు." అని హ్రిషికేష్ అన్నారు.
మీకు తెలియకుండా మీ ఫోన్ డేటా సేకరిస్తోంది.. తెలుసా?
Zero Labs Set Up Data Lab in Hyderabad :కేవలం గురునానక్ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులకే కాకుండా సాఫ్ట్‌వేర్ డెవలపర్స్, ప్రాజెక్ట్ నిర్వాహకులకు ఇది ఎంతో ఉపయోగపడనుందని గురునానక్ ఇంజినీరింగ్ విద్యా సంస్థ వైస్‌ఛైర్మన్ గగన్‌దీప్ సింగ్ కోహ్లీ తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టంలో భాగంగా విద్యాసంస్థలు తప్పని డేటా భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని సూచించారు. దీనిలో భాగంగా విద్యార్థులను అందులో నైపుణ్యం సాధించే విధంగా శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.